Andhra PradeshEast GodavariNews

*దుర్గాలంకారంలో విజయ దుర్గ అమ్మవారు*

*దుర్గాలంకారంలో విజయ దుర్గ అమ్మవారు*

  *కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:**వెదురుపాక విజయదుర్గా పీఠంలో దుర్గా స్వరూపంలో విజయ దుర్గ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రులు లో భాగంగా ఏడో రోజు బుధవారం అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. పీఠ బ్రహ్మ చీమల కొండ శ్రీనివాసావధాని ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, సహస్ర నామాలతో కుంకుమ పూజలు నిర్వహించారు. మూల పూజలు ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పీఠానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం( గాడ్) ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ దుర్గా స్వరూపిణి గా ఉన్న విజయ దుర్గ అమ్మవారిని అర్చిస్తే ఆయురారోగ్యాలు కలిగి సుఖశాంతులతో జీవిస్తారని, ఈతిబాధలు తొలగిపోతాయని ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వి వి బాపిరాజు, గాదె సత్య వెంకట కామేశ్వరి, పి సత్య కనకదుర్గ , పి ఆర్ ఓ వాడ్రేవు వేణుగోపాల్ (బాబి), పీఠం సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Comment here