Andhra PradeshEast GodavariNews

నన్నయలో కోవిడ్ వ్యాక్సినేషన్ పరిశీలించిన వీసీ

నన్నయలో కోవిడ్ వ్యాక్సినేషన్ పరిశీలించిన వీసీ

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు పరిశీలించారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత తీసుకోవల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించి కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాజమహేద్రవరం డిప్యూటీ డి.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్ పితాని కోమల, రాజానగరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.టి.రవికుమార్ ల సహకారంతో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసామని అన్నారు. సుమారు 250 కోవిషీల్డ్ డోసులను అందుబాటులో ఉంచామని విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు ఈ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోవిడ్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అందరూ తప్పని సరిగా వ్యాక్సిన్ లు వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్స్ వేయించుకున్న తరువాత కూడా కోవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని తెలియజేసారు. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డా.కె.రమణేశ్వరి, డా.వి.పెర్సిస్, డీన్ ఆచార్య పి.సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Comment here