Andhra PradeshEast GodavariNews

నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి.. 

నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి..
ఉత్తర ప్రదేశ్ రైతులకు కాంగ్రెన్ ఘన నివాళులు
రాజమహేంద్రవరం :
బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అఖింపూర్ కేరీ జిల్లాలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను కాన్వాయ్ ఢీకొట్టి చంపేయడం దారుణమన్నారు. స్థానిక కృష్ణనగర్లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఆదివారం బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా పుష్పాంజలి ఘటించారు. బాలేపల్లి మాట్లాడుతూ | సుమారు 10 నెలలుగా రైతులకు, వ్యవసాయానికి నష్టం చేకూర్చే నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు రాత్రనక, పగలనక ఎండా, వానా, చలిని లెక్క చేయకుండా పోరాటం చేస్తూంటే బీజేపీ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. కేంద్ర మంత్రి కుమారుడు కాన్వాయ్లో ఢీకొట్టడంతో 10 మంది వరకు రైతులు చనిపోయారన్నారు. ఈ ఘటనకు కారకుడైన అతడిని అరెస్టు చేయడంతో పాటు కేంద్ర మంత్రిని తక్షణం పదవి నుంచి భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ తరపున డిమాండ్ చేసారు. అమరులైన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. రైతుల ఉద్యమంలో అశువులు బాసిన వారి ఆత్మలు శాంతించాలని భగవంతుణ్ణ్ని ప్రార్థించారు. శాంతి యుతంగా ఉద్యమాలు చేస్తున్న రైతుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తూ వారిపై దాడులకు తెగపడటం క్షమించరాని నేరమన్నారు. అందరికి అన్నం పెట్టే రైతుల గోడును ఇప్పటికైనా పట్టించుకుని నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. వీసిన కార్యదర్శి బెజవాడ రంగారావు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య ఉద్యమం చేసి బ్రిటీషు పాలకులను దేశం నుంచి తరిమికొట్టిందని ఇప్పుడు అదే తరహాలో మళ్లీ ప్రజలందరూ రైతులకు మద్దతుగా నిలబడి పోరాటం చేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, కిశోర్ కుమార్ జైన్, బాలాజీ శర్మ, చామర్తి లీలావతి, యిజ్జరౌతు విజయలక్ష్మి, బత్తిన చంద్రరావు, ఎన్ఎన్ యుఐ రాష్ట్ర కార్యదర్శి గట్టి నవతారకేష్. నగర నాయకుడు నందు తదితరులు పాల్గొన్నారు.

Comment here