Andhra PradeshEast GodavariNews

నీలూస్‌ మెగా కలెక్షన్‌ ప్రారంభం

నీలూస్‌ మెగా కలెక్షన్‌ ప్రారంభం
కోస్తా ఎన్ కౌంటర్, అమలాపురం;
అమలాపురం ముస్లింవీధిలో నూతన వస్త్రాలంయ నీలూస్‌ మెగా కలెక్షన్‌ను వైసీపీ నాయకులు, సీనియర్‌ న్యాయవాది కుడుపూడి సూర్యనారాయణరావు గురువారం ప్రారంభించారు. షాపు అధినేత వి.ఎస్‌.నీలిమాకు ఈ సందర్భంగా  అభినందనలు తెలియజేసారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తమ షాపులో నాణ్యమైన వస్త్రాలు, ఆఫ్‌ శారీస్‌ మోడల్స్‌, వెరైటీలు సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. నెట్‌ శారీస్‌, బెనారస్‌, జ్యూట్‌ ఆఫ్‌ శారీస్‌ మోడల్స్‌, వర్క్‌ శారీస్‌, వోణిలు, క్యాట్‌ లాక్‌ శారీస్‌, గద్వాల్‌, కంచి,ధర్మవరం,రెడీమేడ్స్‌ డ్రెస్సెస్‌ లభిస్తాయన్నారు. ఖాతాదారులకు నచ్చే విధంగా అన్ని రకాల మోడల్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. విశాఖపట్నంలో మూడు షాపులు నడుస్తుండగా, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఈ నాణ్యమైన వస్త్రాలు అందించేందుకు   షాపును ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. రానున్న పండుగలకు మగువలు మెచ్చిన వస్త్రాలు తమవద్ద లభిస్తాయన్నారుఈ కార్యక్రమంలో శ్రీ అఖిల్‌, రాష్ట్ర నృత్య మండలి ఛైర్మన్‌ కుడుపూడి సత్యశైలజ, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, సీనియర్‌ నాయకులు చెల్లుబోయిన శ్రీను,  కౌన్సిలర్లు సంసాని నాని, దొమ్మేటి రాము, వాసర్ల లక్ష్మి, నాయకులు కుడుపూడి భరత్‌, కుడుపూడి బాబు, వాసంశెట్టి సత్యం, వాసంశెట్టి సుభాష్‌, రాజీవ్‌, రాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Comment here