Andhra PradeshEast GodavariNews

నేలటూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రచార రథం ఊరేగింపు

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:సనాతన హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రచార రథం బుధవారం నేలటూరు గ్రామంలో భక్తుల దర్శనార్థం ఊరేగించారు.మహిళా భక్తులు రధానికి హారతి పట్టి స్వామివారిని దర్శించుకున్నారు.భక్తులకు స్వామివారి ఫోటో అక్షింతలు,పంపిణీ చేశారు.ప్రచార సమితి నిర్వాహకులు కరుటూరి వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటివరకు 1,616 గ్రామాలలో స్వామి వారి ప్రచార రధాన్ని  ఊరేగించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ తో పాటు స్థానిక దేవస్థానం ఈ ఓ,చైర్మెన్,గ్రామ పెద్దలు,భజన కోలాట బృందాలు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Comment here