Andhra PradeshEast GodavariNews

న్యాయం చేస్తానని..నయవంచన

న్యాయం చేస్తానని..నయవంచన
`గోకవరంలో.. ఓ మైనార్టీ నాయకుడి భూ దందా
`సెటిల్‌ మెంట్‌ పేరుతో..4.5 ఎకరాలు కబ్జా
`దర్జాగా దోపిడీలు.. కబ్జాలు
`ఖద్దరు మాటున..గలీజు పనులు
`సిఎం జగన్‌ సర్కార్‌కు.. చెడ్డపేరు
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా..షరా మామూలే. నాయకులు మారుతున్నారు తప్పా.. దోపిడీ మామూలే. రాజకీయం అంటే.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆకాశమే హద్దుగా దోచేయడమే. ప్రజల హృదయాల్లో పది కాలాలు నిలిచిపోయేలా పని చేయడం కన్నా..పది తరాలు కూర్చుని తిన్నా కరగని ఆస్థి పాస్తులను సంపాదించడమే లక్ష్యంగా నేటి రాజకీయం మారిపోయింది. ప్రజా ప్రతినిధుల చుట్టూ ఉండేవారే అవినీతి పరులు, అక్రమార్కులు అయితే.. ఇక చెప్పేదేముంది. దీనిపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం. (జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి,రాజమహేంద్రవరంÑ రాజకీయాల్లో.. అధికారం సంపాదించడమే అంతిమ లక్ష్యం. దీనికోసం..ఎన్ని రకాలుగా అయినా దిగజారతారు.ప్రజల కోసమే పుట్టామన్నట్లుగా.. నమ్మిస్తారు. తారా అధికారంలోకి వచ్చాకా.. విలువలు మరిచిపోతారు.ఇదీ.. నేటి రాజకీయం.. దీనికి నిలువెత్తు నిదర్శనం. ప్రజలకు సేవ చేయడానికే.. రాజకీయం. ఇది పాత చింతకాయ పచ్చడిలాంటి మాట. రాజకీయం అంటే.. పక్తు వ్యాపారం. ఎంపిగానో..ఎమ్మెల్యేగానో నెగ్గిన తర్వాత..ఇక ఐదేళ్ల పాటు పూర్తిగా రెచ్చిపోవడమే. డబ్బులు సంపాదించడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే. అన్నింటికి తమ అధికారాన్ని ఉపయోగించేయడమే.
తామేదో దైవాంశ సంభూతులుగా భావిస్తూ..భూమి పట్టుకుని అస్సలు నిలబడరు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. నేటి రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోతున్నాయి కాబట్టి. ఇక అసలు విషయానికి వస్తే..తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో అధికార వైసిపికి చెందిన ఓ మైనార్టీ నాయకుడు ఉన్నాడు. ఇతగాడు..స్థానికంగా బాగా పలుకుబడి..ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు. దేశం మీద భక్తి.. ప్రజల పట్ల ఎక్కడ లేని ప్రేమాభిమానాలు ఉన్నట్లు తెగ నటిస్తూ ఉంటాడు. స్థానిక ప్రజా ప్రతినిథికి గతంలో ఓ ఖరీదైన కారును కూడ బహుమతిగా ఇచ్చాడు. దీంతో తనపై ఆ ప్రాంత ప్రజా ప్రతినిథికి ప్రత్యేక అభిమానం ఉన్నట్లు ప్రచారం చేసుకోవడం ఈ మైనార్టీ నాయకుడి జిమ్మిక్కుల్లో ఒకటి. తనకు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయని.. ప్రచారం చేసుకునే ఈ మైనార్టీ నాయకుడు.. ఇటీవల ఓ రెండు కుటుంబాల మధ్య భూ వివాదాన్ని పరిష్కరిస్తానని.. రెండు కుటుంబాలను ముగ్గులోకి దించాడు. ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం.. కోర్టులో ఉండగానే.. తానే ఇరు వర్గాలకు న్యాయం చేస్తానంటూ రంగంలోకి దిగాడు. ఎంతో మంచివాడిగా నటిస్తూ.. ఓ వర్గం వారిని తన ఇంటికి పిలుపించుకుని.. సెటిల్‌ మెంట్‌ పేరుతో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. నిరక్షరాస్యులైన ఈ రెండు కుటుంబాల్లోని ఒక వర్గం వారు.. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో సంతకాలు పెట్టేసారు. ఇది జరిగిన మూడు నెలల తర్వాత.. సదరు మైనార్టీ నాయకుడి.. నిజ స్వరూపం బట్టబయలైంది. నయవంచన… వెక్కిరించింది. న్యాయం చేస్తానని..నయవంచన
`గోకవరంలో.. ఓ మైనార్టీ నాయకుడి భూ దందా
`సెటిల్‌ మెంట్‌ పేరుతో..4.5 ఎకరాలు కబ్జా
`దర్జాగా దోపిడీలు.. కబ్జాలు
`ఖద్దరు మాటున..గలీజు పనులు
`సిఎం జగన్‌ సర్కార్‌కు.. చెడ్డపేరు
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా..షరా మామూలే. నాయకులు మారుతున్నారు తప్పా.. దోపిడీ మామూలే. రాజకీయం అంటే.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆకాశమే హద్దుగా దోచేయడమే. ప్రజల హృదయాల్లో పది కాలాలు నిలిచిపోయేలా పని చేయడం కన్నా..పది తరాలు కూర్చుని తిన్నా కరగని ఆస్థి పాస్తులను సంపాదించడమే లక్ష్యంగా నేటి రాజకీయం మారిపోయింది. ప్రజా ప్రతినిధుల చుట్టూ ఉండేవారే అవినీతి పరులు, అక్రమార్కులు అయితే.. ఇక చెప్పేదేముంది. దీనిపై కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక కథనం. (జె.కళాధర్‌)
కోస్తా ఎన్‌కౌంటర్‌ ప్రత్యేక ప్రతినిథి,రాజమహేంద్రవరంÑ రాజకీయాల్లో.. అధికారం సంపాదించడమే అంతిమ లక్ష్యం. దీనికోసం..ఎన్ని రకాలుగా అయినా దిగజారతారు.ప్రజల కోసమే పుట్టామన్నట్లుగా.. నమ్మిస్తారు. తారా అధికారంలోకి వచ్చాకా.. విలువలు మరిచిపోతారు.ఇదీ.. నేటి రాజకీయం.. దీనికి నిలువెత్తు నిదర్శనం. ప్రజలకు సేవ చేయడానికే.. రాజకీయం. ఇది పాత చింతకాయ పచ్చడిలాంటి మాట. రాజకీయం అంటే.. పక్తు వ్యాపారం. ఎంపిగానో..ఎమ్మెల్యేగానో నెగ్గిన తర్వాత..ఇక ఐదేళ్ల పాటు పూర్తిగా రెచ్చిపోవడమే. డబ్బులు సంపాదించడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే. అన్నింటికి తమ అధికారాన్ని ఉపయోగించేయడమే.
తామేదో దైవాంశ సంభూతులుగా భావిస్తూ..భూమి పట్టుకుని అస్సలు నిలబడరు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. నేటి రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోతున్నాయి కాబట్టి. ఇక అసలు విషయానికి వస్తే..తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో అధికార వైసిపికి చెందిన ఓ మైనార్టీ నాయకుడు ఉన్నాడు. ఇతగాడు..స్థానికంగా బాగా పలుకుబడి..ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు. దేశం మీద భక్తి.. ప్రజల పట్ల ఎక్కడ లేని ప్రేమాభిమానాలు ఉన్నట్లు తెగ నటిస్తూ ఉంటాడు. స్థానిక ప్రజా ప్రతినిథికి గతంలో ఓ ఖరీదైన కారును కూడ బహుమతిగా ఇచ్చాడు. దీంతో తనపై ఆ ప్రాంత ప్రజా ప్రతినిథికి ప్రత్యేక అభిమానం ఉన్నట్లు ప్రచారం చేసుకోవడం ఈ మైనార్టీ నాయకుడి జిమ్మిక్కుల్లో ఒకటి. తనకు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయని.. ప్రచారం చేసుకునే ఈ మైనార్టీ నాయకుడు.. ఇటీవల ఓ రెండు కుటుంబాల మధ్య భూ వివాదాన్ని పరిష్కరిస్తానని.. రెండు కుటుంబాలను ముగ్గులోకి దించాడు. ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం.. కోర్టులో ఉండగానే.. తానే ఇరు వర్గాలకు న్యాయం చేస్తానంటూ రంగంలోకి దిగాడు. ఎంతో మంచివాడిగా నటిస్తూ.. ఓ వర్గం వారిని తన ఇంటికి పిలుపించుకుని.. సెటిల్‌ మెంట్‌ పేరుతో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. నిరక్షరాస్యులైన ఈ రెండు కుటుంబాల్లోని ఒక వర్గం వారు.. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో సంతకాలు పెట్టేసారు. ఇది జరిగిన మూడు నెలల తర్వాత.. సదరు మైనార్టీ నాయకుడి.. నిజ స్వరూపం బట్టబయలైంది. నయవంచన… వెక్కిరించింది. కోటిన్నర విలువైన పొలం కబ్జా
ఇరు వర్గాలకు న్యాయం చేస్తానని సమ్మించి.. తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్న సదరు మైనార్టీ నాయకుడు.. ఆ తర్వాత పావులు కదిపాడు. గోకవరం మండలంలోనే ఓ గ్రామంలో ఉన్న 9 ఎకరాల్లో 4.5 ఎకరాలను తన పేరుమీద రిజిష్ట్రేషన్‌ చేయించేసుకున్నాడు. పట్టాదారు పాసు పుస్తకాలను మార్పించేసాడు. ఆన్‌లైన్‌లో తన పేరు మీద భూమి మారిపోయేలా.. రెవెన్యూ, సబ్‌ రిజిష్ట్రర్‌ వ్యవస్థలను నోట్ల కట్టలతో నోరు నొక్కేసాడు. పోలీసులను..కరెన్సీ నోట్లతో కొనేసాడు. అసలు మోసం తెలుసుకుని.. ఇదేమిటని అడిగిన బాధితులపై తన మనుషులతో దౌర్జన్యం చేయించాడు. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు బనాయించేలా కథ నడిపాడు. మొత్తానికి కోటిన్నర విలువైన 4.5 ఎకరాల పొలాన్ని ఆక్రమించుకుని.. పెద్ద మనిషిగా చలామణి అయిపోతున్నాడు.
న్యాయం కోసం..
తమ కుటుంబానికి చెందిన ఆస్థిని.. సెటిల్‌ మెంట్‌ చేస్తానని చెప్పి.. తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని..స్వాహా చేయడంపై బాధితులు లబోదిబో మంటున్నారు. తమకు ఎక్కడ న్యాయం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహరంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ..ఆస్థిని కాజేసిన వైసిపి నాయకుడు మాత్రం దర్జాగా తిరిగేస్తున్నాడు. ఇటువంటి మేక వన్నె పులులకు.. రాజకీయంగా అధికారమే రక్షణ కల్పిస్తుంది. ఈ నయవంచక భూ దందాపై పూర్తి స్థాయిలో ఆధారాలు అందగానే.. మైనార్టీ నాయకుడి నిజ స్వరూపం బయట పెట్టడం ఖాయం.

Comment here