Andhra PradeshEast GodavariNews

పంచాయితీలో సమస్యలు ఉంటే ప్రశ్నించండి..

పంచాయితీలో సమస్యలు ఉంటే ప్రశ్నించండి..

* ఎక్కడైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురండి
* గోకవరం పంచాయితీ సెక్రటరీ టంకాల శ్రీనివాస్ తో కోస్తావాణి ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యేక ఇంటర్వ్యూ..

ప్రశ్నలు…. సమాధానాలు

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం :  వీధి లైట్లు సరిగా పని చేస్తున్నాయా?   కొత్త లైట్లు ఏమైనా అందుబాటులో ఉంచారా ?
సెక్రటరీ : గోకవరం పంచాయతీలో 1131 వీధి లైట్లు ఉన్నాయి.. అన్ని సక్రమంగా పని చేసే విధంగా ఏర్పాట్లు చేసాము..ఎక్కడైనా వెలగకపోతే మా దృష్టికి తీసుకురండి. అదనంగా 50 కొత్త ఎల్ ఈ డీ బల్బులను కొంటున్నాము. ఒక్కో బల్బ్ పూర్తి సెట్ తో కలిపి ధర 1200 రూపాయలు.
* కోస్తాఎన్ కౌంటర్, ప్రతినిధి : కొంతమందికి పెన్షన్లు ఎందుకు నిలిచిపోయాయి ?  ఎంతమందికి నిలిచిపోయాయి ? అలాగే ఎన్ని కొత్త పెన్షన్లు మంజూరు అయ్యాయి ?
* సెక్రటరీ : 22 మంది పెన్షన్లు వివిధ కారణాలతో నిలిచిపోయాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇమ్మని ఆడిగాము. అవి వచ్చేలా చేస్తాము. కొత్తగా 62 పెన్షన్లు మంజూరు అయ్యాయి.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : తాగునీటి బోర్లు మరమ్మతులు అవుతున్నాయి. వాటిని రిపేర్ చేస్తున్నారా ?
* సెక్రటరీ : మా పరిధిలో 64 బోర్లు ఉన్నాయి. వెంటనే రిపేర్ చేయిస్తున్నాము. ఇంకా ఎక్కడైనా రిపేర్లు ఉంటే తప్పకుండా చేయిస్తాము.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి :డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, శుభ్రం చేయించడం లేదని అంటున్నారు. దీనికి మీ సమాధానం ?
* సెక్రటరీ : డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాము. తీసిన చెత్తను వెంటనే బయటకు తరలిస్తున్నాము. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ వీధిలో వాళ్ళు తెలియపర్చండి.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : డ్రైనేజీ వ్యవస్థ కు సంబంధించి ప్రత్యేక టీమ్స్ వంటివి ఏర్పాటు చేయొచ్చు కదా ?
* సెక్రటరీ : ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాము. వారానికి రెండుసార్లు ఎనిమిది మందితో కూడిన టీం డ్రైనేజీల పై పనిచేస్తుంది. రోడ్డు శుభ్రం చేయటం, చెత్త తీయటం, పైపులు లీకేజీ వస్తే బాగు చేయటం చేస్తారు.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : కొన్ని చోట్ల కొత్త డ్రైనేజీలు  నిర్మించాల్సి ఉంది ? ఎక్కడెక్కడ నిర్మించాలో గుర్తించారా ?
* సెక్రటరీ : తొమ్మిది కొత్త డ్రైనేజీలను నిర్మించాల్సి ఉంది. సంజీవయ్య నగర్ లో అయిదు, డ్రైవర్స్ కాలనీ లో నాలుగు డ్రైనేజీలకు ప్రతిపాదనలు పంపించాము.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : సంత మార్కెట్లో కొత్తగా కడుతున్న నిర్మాణాలు ఎందుకు ఆగిపోయాయి ? ఎప్పటికి పూర్తి అవుతాయి ?
* సెక్రటరీ : సగం వరకు నిర్మాణాలు కట్టారు. వాటి బిల్లులు ఇంకా అవ్వలేదు. మొదటి విడత బిల్లులు అవ్వగానే పనులు ప్రారంభిస్తారు.. త్వరలోనే పూర్తి చేస్తాము.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : కోతులు, పందులు, కుక్కలు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంచాయితీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?
* సెక్రటరీ : దీని పై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. గత సంవత్సరం కోతులను పట్టుకుని అటవీప్రాంతంలో వదిలేసాము..ఈ సారి కూడా చేస్తాము.. పందులు, కుక్కల కు సంబంధించి చర్యలు తొందరలోనే తీసుకుంటాము.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : ప్రధాన రోడ్లు పై ఆక్రమణలు జరుగుతున్నాయి.. ఎందుకు మీరు స్పందించడం లేదు ?
* సెక్రటరీ : పంచాయితీ రోడ్ల పై ఆక్రమణలు ఉంటే ఖచ్చితంగా చర్యలు చేపడతాము. అలాగే ప్రధాన రోడ్డు పై అడ్డంగా పెడుతున్న షాప్స్ ని తొలగించడం జరుగుతుంది.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉన్న వారికి నోటీసులు ఇస్తామని చెప్పారు.. ఎందుకంటే మురుగునీరు నిల్వ ఉంటుందని. దీనిపై ఎవరికైనా నోటీసులు ఇచ్చారా ?
* సెక్రటరీ : 10 మందికి నోటీసులు ఇచ్చాము. పంచాయితీ కార్యాలయానికి పిలిపించి చెప్పాము. కొన్ని చోట్ల మోటార్ ద్వారా మురుగునీటిని తోడించాము.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : మీ పరిధిలో ఎన్ని సచివాలయాలు నిర్మిస్తున్నారు. ఎందుకు నిర్మాణాల్లో జాప్యం జరుగుతుంది *
* సెక్రటరీ : నాలుగు సచివాలయాలు నిర్మిస్తున్నారు.  రెండు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. మిగతా రెండు పనులు జరుగుతున్నాయి. ఎరకల దిబ్బ, తహసీల్దార్ కార్యాలయం వద్ద సచివాలయం పనులు ఇంకా జరుగుతున్నాయి.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : కొన్ని వీధుల్లోకి పంచాయితీ నీరు సరిపోవడం లేదు. దీని గురించి మీరు చేపట్టే చర్యలు ఏమిటీ ?
* సెక్రటరీ : పంచాయితీల కుళాయిల ద్వారా నీటి సరఫరా సక్రమంగా అయ్యేలా చూస్తున్నాము.. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావొచ్చు. అంతేకాకుండా 10 లక్షల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ ని నిర్మించటానికి ప్రయత్నాలు చేస్తున్నాము.కొత్తగా కడుతున్న ఒకటో నంబర్ సచివాలయం వీధిలో.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి : వర్షం వస్తే ప్రధాన రహదారి అంతా నీటితో నిండిపోతుంది. దీనికి శాశ్వత పరిష్కారం ఎందుకు చేపట్టడం లేదు ?
* పూర్తి స్థాయి డ్రైనేజీలను నిర్మించాలి.. కానీ ప్రధాన రోడ్డు ఆర్ అండ్ బి శాఖాధికారులకు సంబంధించినది. పంచాయితీ తరుపున పనులు చేయించడం కష్టం.
* కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిది : ప్రస్తుతం దోమలు బెడద ఎక్కువగా ఉంది. వీధులు శుభ్రం చేయించడం, దోమల మందు పిచికారీ చేయించడం ఎందుకు నిలిపివేశారు ?
* సెక్రటరీ : కొద్దీ రోజుల క్రితం వరకు చేశారు. ఎన్నికల లెక్కింపు, మరికొన్ని ముఖ్య పనులు కారణంగా ఆగింది.. ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తాము.. దోమల మందు ఎప్పుడు కొట్టేలా చర్యలు తీసుకుంటాము.

Comment here