Andhra PradeshEast GodavariNews

పంచాయితీ సభ్యులకు శిక్షణ తరగతులు

పంచాయితీ సభ్యులకు శిక్షణ తరగతులు

 కోస్తా ఎన్ కౌంటర్ :అన్నవరం . నూతనంగా ఎంపికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు రెండు దఫాలుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు శంకవరం ఎంపిడిఓ జె రాంబాబు తెలిపారు సోమవారం శంఖవరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ , ఎంపీపీ పర్వత రాజ బాబు ముఖ్య అతిథిగా హాజరై వార్డు సభ్యులకు గ్రామాలలో ప్రజలకు అందించే సేవల గురించి విధులు బాధ్యతలు పట్ల అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు 4 5 తేదీల్లో ఉదయం9 30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పెద్దమల్లాపురం ,వేళంగి, గౌరవం పేట, అచ్చంపేట , ఎస్ జగ్గంపేట, శంఖవరం, మండపం గ్రామాలకు మిగిలిన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు 7 8 తేదీలలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ ఓ పి ఆర్ డి కాశీవిశ్వనాథం, వైస్ ఎంపీపీ దా రా వెంకటరమణ,, పంచాయతీ వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు

Comment here