Andhra PradeshEast GodavariNews

పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని అధికారుల ను ఆదేశించిన ఐటిడిఎ పిఓ…

పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని అధికారుల ను ఆదేశించిన ఐటిడిఎ పిఓ…

 

కోస్తా ఎన్ కౌంటర్ , రంపచోడవరం : ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే భాద్యత సంబందిత అధికారులపై ఉందని రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు.
మంగళవారం స్ధానిక ఐ.టి.డి.ఎ. సమావేశపు హాలులో టూరిజం, ఫారేష్టు డిపార్ట్మెంట్, ఆర్.అండ్.బి., వెలుగు, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు టూరిజం ప్రాంతాల మండలాలకు సంబందించిన తహశీల్దార్లు, ఎం.పి.డి.ఒ. లు, పోలీసు శాఖ అధికారులతో ప్రాజెక్టు అధికారి సమీక్షా సమావేశం, జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ రంపచోడవరం మండలంలో భూపతిపాలెం, ఐ.పోలవరం, సీతపల్లి వాగు టూరిజం ప్రాంతాలలో కొంతమంది యువకులు స్నానాలకు వాగు వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నందున పోలీసు పెట్రోలింగ్ ప్రతిరోజూ నిర్వహించాలని అదేవిదంగా ఈ వాగులలో లోతు ఎక్కువగా వున్నా ప్రాంతాలకు స్నానాలకు వెళ్ళకుండా అవసరమున్న ప్రాంతాలలో బారికేడ్లు ఏర్పాటుచెయ్యాలని అదేవిదంగా ప్రమాదాలు సంబవించకుండా డిస్ప్లే బోర్డ్లు ఏర్పాటుచెయ్యాలని సంబందిత అధికారులను ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు. జలపాతాలలో చిన్న పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు కూడా పర్యాటక ప్రాంతాలని సందర్శన కొరకు వచ్చిన వారిని జలపాతాలకు స్నానాలకు వెళ్ళకుండా సంబందిత గ్రామ సచివాలయ వాలంటీర్లకు డ్యూటీలు వేసి పర్యాటకులకు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని సంబందిత అధికారులను పి.ఒ. ఆదేశించారు. ఈ జలపాతాలు ఉన్న ప్రాంతాలలో లైఫ్ జాకెట్లు, మెడికల్ కిట్లు, తాళ్ళు అందుబాటులో ఉంచాలని సంబందిత అధికారులను పి.ఒ. ఆదేశించారు. అదేవిదంగా టూరిజం ప్రాంతాలలో ఉన్న ప్రాధమి ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు సంబందించిన ఫోను నంబర్లను డిస్ప్లే బోర్డులపై ఏర్పాటు చెయ్యాలని సంబందిత అధికారులను పి.ఒ. ఆదేశించారు. అదేవిదంగా ఐ.టి.డి.ఎ. లో కూడా టోల్ ఫ్రీ నంబర్లను కూడా డిస్ప్లే చెయ్యాలని సంబందిత అధికారులను పి.ఒ. ఆదేశించారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించేందుకు వైర్లేస్స్ సెట్లను కూడా ఏర్పాటుచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ యువకులు రావడం జరుగుతుందని ఈ టూరిజం ప్రాంతానికి వచ్చిన యువకులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెయ్యడం వలన అదుపుతప్పి ఎక్కువ ప్రమాదాలకు గురౌతున్నారని, ఇటువంటివి పునరావృతం కాకుండా ఎక్కడికక్కడ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించి అటువంటి వారిపై కేసులు పెట్టాలని అదేవిదంగా ఇక్కడికి వచ్చే టూరిష్టులు తిని పారవేసే చెత్తా చదారం ఎక్కడపడితే అక్కడ వేయ్యకుండా ఇటువంటి వాటిపై కూడా డిస్ప్లే బోర్డులు ఏర్పాటుచెయ్యాలని సంబందిత అధికారులను పి.ఒ. ఆదేశించారు. అడ్డతీగల మండలం పింజరికొండ, వేటమామిడి, మిట్లపాలెం జలపాతాలలో టూరిష్టులను స్నానాలకు వెళ్ళకుండా నిరోధించి సందర్సించుటకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చెయ్యాలని సంబందిత అధికారులను పి.ఒ. ఆదేశించారు. అదేవిదంగా మారేడుమిల్లి మండలం పాములేరు, జలతరంగిణి, అమృతధార లో కూడా స్నాలకు వెళ్ళకుండా నిరోధించి సందర్సించుటకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చెయ్యాలని సంబందిత అధికారులను పి.ఒ. ఆదేశించారు. పాములేరు వాగు దగ్గర అవసరమున్న ప్రాంతాలలో బారికేడ్లు ఏర్పాటుచెయ్యాలని అదేవిదంగా ప్రమాదాలు సంబవించకుండా డిస్ప్లే బోర్డ్లు ఏర్పాటుచెయ్యాలని సంబందిత అధికారులను ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు. పాములేరు దగ్గర జియో టవర్ ఏర్పాటుచేయ్యడం జరిగిందని, ఆ పరిసర ప్రాంతాలలో కూడా నెట్వర్కు ఉంటుందని, ఈ పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా ప్రమాదాలు సంబంవించిన యెడల వివారాలు తెలుసుకొని తగు చర్యలు తీసుకోవచ్చని ఆయన తెలిపారు. రంపచోడవరం, మారేడుమిల్లి మండలాలలో ప్రైవేట్ రిసార్టులలో ఏమి జరుగుతుందో తెలియడం లేదని, ఎటువంటి వివరాలు నిర్వాహకులు ఇవ్వడం లేదని జిల్లా టూరిజం అధికారి పి.వెంకటాచలం ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రంపచోడవరం, మారేడుమిల్లి మండలాలలో ప్రైవేట్ రిసార్టుల యజమానులతో సమావేశం నిర్వహించి, ఎప్పటికప్పుడు ప్రైవేట్ రిసార్టులను సందర్శించాలని టూరిజం అధికారులను పి.ఒ. ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్ డి.ఎఫ్.ఒ. నిషాకుమారి, జిల్లా టూరిజం అధికారి పి.వెంకటాచలం, ఎ.పి.డి. వెలుగు ఎ.శ్రీనివాసరావు, ఎఫ్.ఆర్.ఒ. దుర్గ రాంప్రసాదు, ఎ.డి.ఎ. లు శ్యామల, దైవ కృపారత్నం, ఆర్.అండ్.బి. డి.ఇ. సాయిసతీష్, ఎ.పి.డి. ఉపాది కోటేశ్వరరావు, ఎస్.ఒ. వెంకటేశ్వరరావు, డి.ఎస్.ఒ. భాస్కరరావు, ఎం.పి.డి.ఒ. ఎ.లక్ష్మీరేడ్డి తహశీల్దార్ లక్ష్మీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Comment here