Andhra PradeshEast GodavariNews

*పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి*

*పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటాలని మండల కేంద్రమైన రాయవరం గ్రామ సర్పంచ్ చంద్ర మళ్ల రామకృష్ణ కోరారు. జగనన్న పచ్చతోరణం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రస్తుత కలుషిత వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్  పెరిగిపోయి ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారన్నారు. విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడినప్పుడే ,మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామంలో చెరువు గట్లు , కాలువ గట్లు, ఖాళీ ప్రదేశాల్లో కొబ్బరి మొక్కలు, వివిధ రకాల ఫలవృక్షాలు, నీడనిచ్చే చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొడ్డు శ్రీను ,వార్డు సభ్యులు, పంచాయితీ కార్యదర్శి ఏ. గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

Comment here