Andhra PradeshEast GodavariNews

పల్లెపాలెం లో సినీ సందడి

 యానాం నియోజవర్గం పరిసర ప్రాంతామైన పల్లి పాలెం గ్రామంలో శరవేగంగా జరుగుతున్న  హీరో రాజు సినిమా షూటింగ్… పల్లిపాలెం గ్రామంలో  నందీశ్వర సినీ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కునున్న  ఆకాంక్ష సినిమా షూటింగ్ పల్లెటూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.
గత పది రోజులుగా యానం పరిసర ప్రాంతంలో జరగగా, గత రెండు రోజుల నుంచి పల్లెపాలెం లో చింతపల్లి చెల్ల రెడ్డి  గారి ఇంట్లో జరుగుతుంది..
ఇందులో సీనియర్ నటులు చిత్రం శ్రీను మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకోవడం ఎంతో ఆహ్లాద కరంగా ఉందని, దర్శకుడు హరికృష్ణ మొదటి చిత్రం లో నన్ను ఎంపిక చేసికోవడం ఎంతో సంతోషమని, మాకు సహకరిస్తున్న పల్లిపాలెం కృష్ణా రెడ్డి గారికి, బన్నీ కి, ప్రేమ్ సాగర్ కి, నిర్మాతకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను అని తెలియజేశారు..దర్శకుడు హరికృష్ణ మాట్లాడుతూ హీరో శాంతి రాజు, హీరోయిన్ అక్షాఖాన్ జంటగా నటిస్తున్న  ఆకాంక్ష ఈ ప్రేమ కథ చిత్రం చాలా బాగుంటుంది ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం, నాలుగు పాటలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నం.మాకు  సహకరిస్తున్న నిర్మాత సూహన్ కు ఈ పల్లెపాలెం లో మాకు సహకరిస్తున్న ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని తెలియజేశారు.
నిర్మాత సూహన్ మాట్లాడుతూ ఇది  మా మొదటి చిత్రం , దర్శకులు హరికృష్ణ గారు ఒక కథ చెప్పగానే నాకు నచ్చింది ఓకే చెప్పి షూటింగ్ ప్రారంభించమని తెలిపారు. ఏ సినిమాలో మీరందరూ ఆదరించి మాకు విజయం  ఇస్తారని ఆశిస్తున్నాను. అని తెలియజేశారు.హీరో శాంతి రాజు మాట్లాడుతూ ఇది నాలుగవ చిత్రం మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ తో ముందుకు వెళ్తున్న ఈ సినిమా షూటింగ్ సక్సెస్ కావాలని మీరు అందరూ సహకరించాలని, నాకు అవకాశం  ఇచ్చిన దర్శకులు హరికృష్ణ, నిర్మాత, చిత్రం శ్రీను మాకు సహకరిస్తున్న టీమ్ అంతటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు: ప్రేమ్ సాగర్,కృష్ణ రెడ్డి,మేడిచెట్టి శ్రీను,సహ నిర్మాతలు: బన్నీ,రాంబాబు,
కెమెరామన్ :యేసు
దర్శకులు: హరికృష్ణ ,
నిర్మాత: సుహన్
హీరో: శాంతి రాజు
హీరోయిన్ : డీ జోడీ ఫేం అక్షఖాన్.
ప్రొడక్షన్ కంట్రోలర్ టీమ్,
మొదలగు వారు పాల్గొన్నారు..

Comment here