Andhra PradeshEast GodavariNews

పవన్‌ కళ్యాణ్‌ వర్గ వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు

2024లోనూ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి..
` పవన్‌ కళ్యాణ్‌ వర్గ వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు
వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు కడలి వెంకటేశ్వరరావు
కోస్త ఎన్ కౌంటర్, రాజమహేంద్రవరం సిటీ ;
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితోనే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని వైఎస్‌ఆర్‌సిపి సీనియర్‌ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు అన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు నామినేడెట్‌ పోస్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా సభకు విచ్చేసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వర్గాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికల్లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలో వైఎస్‌ఆర్‌సిపి విజయ దుందుభి మోగించిందన్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలే వైఎస్‌ఆర్‌సిపి పాలనకు నిదర్శనమన్నారు. డిసిసిబి, డిసిఎంఎస్‌, ప్రాధమిక సహకార సంఘాల చైర్మన్ల పోస్టులకు కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. జగన్‌ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పట్ల సుఖ సంతోషాలతో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టేలా పవన్‌ కళ్యాణ్‌ వ్యవహరించడం సరికాదన్నారు. వర్గ, వైషమ్యాలను రెచ్చగొట్టేలా పబ్బం గడుపుకుంటున్న పవన్‌ వైఖరిపై మేధావులు, ప్రజలు, విద్యావేత్తలు చర్చించాలని సూచించారు. గతంలో పరిపాలన చేసిన చంద్రబాబు బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు ఎటువంటి సామాజిక న్యాయం చేయకపోవడం వల్లనే అందరూ ఏకమై చిత్తుగా ఓడిరచి ఇంటికి పంపేసారన్నారు. ఇప్పుడు జగన్‌ పెద్దన్న పాత్రను పోషిస్తానని చెప్పడం వెనుక అంతర్యమేమిటో వెల్లడిరచాలని డిమాండ్‌ చేసారు. ఆయన కూర్చున్న పల్లకీని మోయడమే బడుగు, బలహీన వర్గాల పనా అని నిలదీసారు. జగన్‌ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల ప్రజలకు సమన్యాయం పాటిస్తూ అన్ని పదవుల్లో అగ్రతాంబూలం ఇస్తున్నారన్నారు. జగన్‌ వేల పదవులు మేయర్‌, చైర్మన్‌, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను బడుగు, బలహీన వర్గాలకు కట్టబెట్టారన్నారు. దేశంలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్క వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాత్రమేనని కొనియాడారు. జగన్‌ కంటే ఎక్కువ సమన్యాయం చేసేలా, పదవులు కట్టబెట్టేలా పవన్‌ వద్ద బ్లూ ప్రింట్‌ ఏమైనా ఉందా? అని నిలదీసారు. తొక్కి నారతీస్తా, తాట తీస్తా అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సమంజసం కాదన్నారు. బడుగు, బలహీన వర్గాలు ఇంకా ఎంత కాలం పల్లకీలు మోస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలందరూ పులులు లాంటివారని పవన్‌ వ్యాఖ్యలకు భయపడే వారు ఎవరూ లేరన్నారు. చట్టాలు, పోలీసులు, న్యాయస్ధానాలు ఉన్నాయని వాటి ద్వారా ప్రజలకు అన్యాయం జరిగే న్యాయం చేసేవరకు అండగా ఉంటామన్నారు. ఆంధ్ర రాష్ట్రం పవన్‌ జాగీరా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్‌ రెడ్డి కాలిగోరును కూడా కదలలేవన్నారు. ప్రజలతో మమేకమై సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని సమస్యల పరిష్కారంపై స్పష్టమైన అవగాహనతో ముఖ్యమంత్రి పదవి చేపట్టి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్న జగన్‌ జోలికి వస్తే వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు చూస్తు ఊరుకోవన్నారు. వారికి సమాధానం చెప్పడానికి జగన్‌ చిరునవ్వు సరిపోతుందన్నారు. సింహం ఎప్పుడు సింగిల్‌గానే వస్తుందని 2024 ఎన్నికల్లో కూడా వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి రావడం జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు గేడి అన్నపూర్ణ రాజు, పీతా రామకృష్ణ, ఉల్లూరి రాజు, నందం స్వామి, సప్పా ఆదినారాయణ, బుడ్డిగ శ్రీను, మార్గాని చంటిబాబు, ఉల్లంగి కొండబాబు, గుత్తుల శ్రీను, గుత్తుల భాస్కర్‌, బిల్డర్‌ చిన్న, కోమలి కిషోర్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
“`

Comment here