Andhra PradeshEast GodavariNews

పశువులలో గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం

పశువులలో గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం
కోస్తాఎన్ కౌన్సిల్,గండేపల్లి : గండేపల్లి మండలం మురారి గ్రామంలో సోమవారం జాతీయ  పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం లో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువైద్యాధికారి  ప్రగడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పశు వైద్య  శిబిరాన్ని  నిర్వహించి 120 పశువులకు టీకాలను వేయించారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు చలగళ్ళ దొరబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి వలన పశువులు కళ్ళల్లో, నోటిలోని పుండ్లు పడి మేత  తినలేక పాల ఉత్పత్తి పునరుత్పత్తి గణనీయంగా పడిపోతున్నాయని ఆయన అన్నారు.  పశు పోషకులు ఎటువంటి అపోహలకు పోకుండా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలన్నారు. అదేవిధంగా గండేపల్లి లో ఎంపిటిసి మద్దిపట్ల రామకృష్ణ ఆధ్వర్యంలో, నాయకంపల్లి గ్రామంలో గోకిన రాజా ల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందన్నారు.  మిగతా గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం ఈ నెలాఖరు వరకు పశువులకు టీకాలు వేయడం జరుగుతుందని కావున పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గండేపల్లి పశువైద్యులు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ నక్కా ఆనందబాబు, ఉప సర్పంచ్ జాస్తి వసంత, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Comment here