Andhra PradeshEast GodavariNews

పసలపూడి శ్రీ దత్త సాయి ఆలయంలో చిన రాజప్ప పూజలు

*పసలపూడి శ్రీ దత్త సాయి ఆలయంలో చిన రాజప్ప పూజలు*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మండలంలోని పసలపూడి గ్రామంలో వేంచేసియున్నశ్రీ దత్త శిరిడి సాయిబాబా ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాల్లో భాగంగా గురువారం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ పైడిపాల,కర్రి అనసూయ, పి. కుసుమల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జనార్ధన స్వామి పర్యవేక్షణలో బాబా వారికి వేకువజాము నుండి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ పూజల్లో పెద్దాపురం శాసనసభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అనురాధ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ పైడిపాల మా గురువు గారిని ఆయన ఆధ్వర్యంలో నిర్మించిన బాబా ఆలయం దర్శించడానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బాబా ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాబా ఆశీస్సులు పొంది, సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనపర్తి గ్రామానికి చెందిన పూర్వపు ఇంజనీర్ తేతల వెంకటకృష్ణారెడ్డి స్వామివారిని దర్శించుకుని, ఆలయ శాశ్వత నిధికి లక్ష రూపాయల విరాళం అందజేశారు, ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్న తాడి సూరిబాబు, సుజాత దంపతులు స్వామివారికి,వెండి హారం, పాదుకలు, పళ్లెం తదితర వస్తువులు బహూకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం బాబా వారి ఆలయంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నల్లమిల్లి శేషారెడ్డి ,వెలగల అచ్చయ్యమ్మ ,పోతంశెట్టి కుసుమ, పూర్వపు ఇంజనీర్ టి వి కృష్ణారెడ్డి, తో పాటుగా పరిసర గ్రామాలకు చెందిన భక్తులు, అలాగేఅనపర్తి, మామిడాడ ,కాకినాడ నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి బాబాను దర్శించుకున్నారు.

Comment here