Andhra PradeshEast GodavariNews

పాపికొండల అభయారణ్యం లో నాలుగు రకాల జింకలు

పాపికొండల అభయారణ్యం లో నాలుగు రకాల జింకలు

* నెల రోజుల క్రితం చిరుతపులి గుర్తింపు
* సీసీ కెమెరాలకు చిక్కిన జింకలు
* వివరాలు వెల్లడించిన వైల్డ్ లైఫ్ రేంజ్ అధికారి ప్రసాద్

కోస్తా ఎన్ కౌంటర్ గోకవరం: వన్యప్రాణులు సీసీ కెమెరాలకు చిక్కుతున్నాయి..కొద్దిరోజుల క్రితం అడవిదున్నలు, మొన్న చిరుతపులులు, నేడు జింకలు కనిపించాయి.. ఈ సారి కెమెరాల్లో నాలుగు రకాల జింకలను అధికారులు గుర్తించారు.. సీసీ కెమెరాల్లో గుర్తించిన అటవీ జంతువుల వివరాలను వైల్డ్ లైఫ్ రేంజ్ అధికారి ప్రసాద్ వివరాలు తెలిపారు…పాపికొండల అభయారణ్యం అత్యంత దట్టమైన అటవీప్రాంతం.. సుమారుగా లక్ష ఎకరాల్లో విస్తరించి ఉంటుంది.. ఇందులో గోకవరం, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరు, ఉక్కులూరు, పోలవరం, కన్నాపురం రేంజ్ లు ఉన్నాయి. ఏడు రేంజ్ లతో పాటు మూడు బేస్ క్యాంపు లు కూడా ఉన్నాయి.. వీటి పరిధిలో ఎక్కువగా వన్యప్రాణులు తిరిగే ప్రదేశాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేస్తారు.. వన్యప్రాణులతో పాటు ఎవరైనా వ్యక్తులు సీసీ కెమెరాల్లో కనిపిస్తే వాళ్ళని గుర్తించి ప్రశ్నించటం జరుగుతుంది..పాపికొండల అభయారణ్యం అనేది గోకవరం రేంజ్ నుండి ప్రారంభం అవుతుంది.. ఇలా జంతువుల కోసం అధికారులు పెట్టిన కెమెరాల్లో అనేకరకమైన వన్యప్రాణులు కనిపించటం జరుగుతుంది.. కొద్దిరోజులు క్రితం గుంపుగా వెళుతున్న అడవి దున్నలు కనిపించాయి.. తరువాత చిరుతపులులు కనిపించాయి.. ఇప్పుడు పాపికొండల అభయారణ్యం లో ఒకే సారి నాలుగు రకాల జింకలను అధికారులు గుర్తించారు.. వీటి పేర్లను అధికారులు వెల్లడించారు.. సీసీ కెమెరాల్లో కనిపించిన జింకలను మౌన్ డీర్, సాంబార్ డీర్, పార్కింగ్ డీర్ సోసింగా డీర్ గా గుర్తించామని వైల్డ్ లైఫ్ రేంజ్ అధికారి ప్రసాద్ తెలిపారు..ఇవి నాలుగు రకాలు ఒకేచోట ఉండటం అరుదుగా జరుగుతుందని చెప్పారు.. వన్యప్రాణులు సంరక్షణ కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.. వన్యప్రాణులను వేటాడిన, మాంస విక్రయాలు చేసిన కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు.. అటవీప్రాంతంలో తిరగటం కూడా నేరమేనని అన్నారు.. అందరు వన్యప్రాణులను రక్షించుకోవాలని సూచించారు.. పెద్ద పులులు కోసం అన్వేషణ కార్యక్రమం చేపడుతున్నామని, త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు..

Comment here