Andhra PradeshEast GodavariNews

పార్టీకి పూర్వ వైభవం

పార్టీకి పూర్వ వైభవం
… కార్యకర్తలారా మనో ధైర్యం గా ఉండండి మీ వెంట నేనున్నాను
… నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి
కోస్తా ఎన్ కౌంటర్, సర్పవరం: కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో నడిపించిన తెలుగుదేశం పార్టీని మళ్లీ తిరిగి పూర్వవైభవం రావడం ఖాయమని కాకినాడ రూరల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. ఆదివారం నాడు కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి మహాలక్ష్మి నగర్ తన స్వగృహమునందు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం చేస్తామని కార్యకర్తలు ఎవరు ఆవేదన చెందవద్దని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి నేడు ప్రజల్లోకి వెళ్లేటప్పుడు కనబడుతుందని వారందరూ మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికలు గెలిచారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో విజయం సాధించలేదని తెలిపారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి నామినేషన్ వేస్తున్నారు వారిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాల్గొనలేదని తెలిపారు. ఇటీవల కాలంలో పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబును అచ్చేయ్య నాయుడును కలవడం జరిగిందన్నారు. ఇటీవల కాకినాడ రూరల్ మండలం నుంచి  కొంతమంది నాయకులు వెళ్లి ఏదో చెప్పడం జరిగిందని, కానీ వాటి కోసం పార్టీ నాయకులు ఏమీ అడగలేదని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడం వల్లనే నియోజకవర్గంలో మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తేవాలని అధినాయకులు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. 1983 నుంచి తెలుగుదేశం  పార్టీలో స్నేహితుడు బొడ్డు భాస్కరరామారావు పార్టీలో జాయిన్ చేయడం జరిగిందన్నారు. అప్పటినుండి నేటి వరకు పార్టీ అధికారంలో ఉండేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. నియోజవర్గంలో చేసిన అభివృద్ధి మా వెంట ఉందని ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కార్యకర్తలు అందరిని కలవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గ కార్యకర్తలు అందరూ మా వెంటే ఉన్నారని అందరినీ కలుపుకొని పార్టీకి పూర్వవైభవం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ  అధ్యక్షులు కర్రీ వెంకట రాజు, డాక్టర్, సామాజికవేత్త చప్పిడి వెంకటేశ్వరరావు, బుంగా సింహాద్రి, దేవు వెంకన్న, తాతపూడి రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

Comment here