Andhra PradeshEast GodavariNews

పిల్లలకు మనమిచ్చే ఆస్తి విద్యేనని  నమ్మిన వ్యక్తి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి 

పిల్లలకు మనమిచ్చే ఆస్తి విద్యేనని  నమ్మిన వ్యక్తి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

కోస్తా ఎన్ కౌంటర్ రామచంద్రపురం; నియోజకవర్గంలోని నరసరావుపేట గ్రామంలో మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పర్యటించారు.  అనంతరం 8కోట్లతో
 రామచంద్రపురం మండలం నరసాపురపుపేట గ్రామ పరిధిలో నిర్మించనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆదివారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ఏకైక మార్గం విద్య అని,  టెక్నికల్ విద్యలో మెరుగైన నైపుణ్యంతో విద్యార్థులను రూపుదిద్దాలనేది జగన్మోహన్ హన్ రెడ్డి ఆశయమని అన్నారు. నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి సాంకేతికత విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి విద్య అని పూర్తిగా విస్వసించే నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆయన  అన్నారు. విద్యా విధానంలో  విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి బావితారాల భవిష్యత్తుకు మంచి పునాదిని ఏర్పాటు చేసిన సీఎం వైఎస్  జగన్మోహన్ రెడ్డేనని ఆయన  అన్నారు. 8 కోట్ల రూపాయలతో ఈ కళాశాలను నిర్మించి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో టెక్నికల్ విద్యను విద్యార్థులకు అందించబోతున్నాం  అని పేర్కొన్నారు.   కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చాట్రాది వీరలక్ష్మి, రామచంద్రపురం మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, ఏపీఈ డబ్ల్యూ ఐ డి సి  డి ఈ చక్రపాణి రావు, ఏఈ సుబ్బరాజు, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కొమ్ము తాతాజీ, అధ్యాపకులు రాంబాబు, వీరబాబు, పావని, సుష్మా దేవి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Comment here