Andhra PradeshEast GodavariNews

పూలే దంపతులకు ఘనంగా నివాళులు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పూలే దంపతులకు ఘనంగా నివాళులు

కోస్తాఎన్ కౌంటర్ రామచంద్రపురం:  టీచర్స్ డే సందర్భంగా ఆదివారం  ద్రాక్షారామ పూలే సెంటర్ లో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే, ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి పాదాలపై పుష్పములు వేసి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా  యాట్ల మాట్లాడుతూ కుల మత బేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన  ప్రేమ స్వరూపిణి సావిత్రీబాయి పూలే అని గుర్తు చేశారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన పతి దేవునితో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిసారిగా  బాలికల పాఠశాలను ప్రారంభించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల,అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం సల్పారు.   సమాజంలో కులతత్వం, పురుషాధిక్యతపై పండిత, మేధావులు అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. సావిత్రీబాయి జన్మదినమైన జనవరి 3 ను మహిళా టీచర్స్ డే గా ప్రభుత్వం ప్రకటించాలని, ఆమెకు భారతరత్న ప్రకటించాలని యాట్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

Comment here