Andhra PradeshEast GodavariNews

పెంటపాడులో అన్నసమారాధన

పెంటపాడులో అన్నసమారాధన

పెంటపాడు ఎస్సీ ఏరియాలో అన్నసమారాధన నిర్వహిస్తున్న దృశ్యం….
కోస్తా ఎన్‌కౌంటర్‌ పెంటపాడు : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన పెంటపాడులో మంగళవారం అన్నసమారాధన నిర్వహించారు. స్థానికులతో పాటు జట్లపాలెం, దర్శిపర్రు గ్రామాల నుంచి సుమారు 800మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే, భవానీ దీక్షాధారులకు బిక్ష ఏర్పాటు చేశారు. తొలుత భవానీ కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో సింహ యూత్‌ సభ్యుడు మారిశెట్టి తారక్‌, కొల్లి అంజి, దుర్గారెడ్డి, షేక్‌ నాగూర్‌, పట్నాల రమణ, మామిడి శెట్టి పెద్దిరాజు, సింహ యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

Comment here