Andhra PradeshEast GodavariNews

పెదబ్రహ్మదేవంలో విజయవంతంగా వేక్సినేషన్

పెదబ్రహ్మదేవంలో విజయవంతంగా వేక్సినేషన్
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో ఆదివారం నాడు పంచాయతీ నందు  ఉదయం 7-00 నుండి మధ్యాహ్నం 12-00గం.ల వరకు 18. సంవత్సరాలు దాటిన వారికి కోవిషీల్డ్  మొదటి డోసు  మరియు రెండోవ డోసు వేక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగినట్లు గ్రామ పంచాయితీ కార్యదర్శి బుల్లియ్యకాపు తెలియజేసారు. ఈకార్యక్రమంలో  పంచాయితీ మెంబర్ తోటకూర దుర్గాలక్ష్మీగంగాధర్ పాల్గొని మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా వేక్సినేషన్ తీసుకోవాలని,మాస్క్ తప్పని సరిగా దరిస్తూ భౌతికదూరం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటకూర సత్తబాబు,ఓదూరి రాంబాబు,విద్యాకమిటీ ఛైర్మన్ ఆటపాకల శ్రీను వైద్యసిబ్బంది,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Comment here