Andhra PradeshEast GodavariNews

పేద కుటుంబానికి 5,000 ఇచ్చిన బోస్

పేద కుటుంబానికి 5,000 ఇచ్చిన బోస్

కోస్తా ఎన్ కౌంటర్ గోకవరం: రామన్న దొర వీధిలో  మస బత్తుల పాప కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. మంచం పట్టింది. తల్లిని చూసుకునేందుకు కూతురు సాయి రేణుక ఉన్న పనిని కూడా మానేసింది. దాంతో  కుటుంబం గడవడం కష్టమైపోయింది. ఒకపక్క తల్లికి అయ్యే మందుల ఖర్చు ఏం చేయాలో  రేణుకకు  తెలియలేదు. మరోపక్క అమ్మమ్మ తాతయ్య కూడా ఉన్నారు. వీరితో పాటు ముసలి వయసులో వారిని కూడా పస్తులు పెడుతున్నారు, ఆ కుటుంబంలో ఒక్కసారిగా కష్టాలు మొదలయ్యాయి. రోజు రోజుకి తల్లి ఆరోగ్యం క్షీణించడంతో తన కూతురు సాయి రేణుక మరింత తపన చెందింది. అల్లారుముద్దుగా పెంచిన తల్లి తన ముందే 24 గంటలు మంచం మీదే ఉండటంతో రేణుక కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. దిక్కు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కోస్తా ఎన్కౌంటర్ లో  వచ్చిన కథనాన్ని చదివి స్పందించిన మాజీ జడ్పీటీసీ పాలూరి బోసు బాబు, ఆ కుటుంబానికి 5,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎస్ఎస్ పోలీ బ్యాగ్స్ యజమాని నాగులకొండ బుజ్జి 25 కేజీల బియ్యం బస్తా వారికి ఇచ్చారు,ఆమె కష్టాలను చూసి గ్రామంలో మరికొంతమంది వారికి సహాయాన్ని అందించారు. సరైన వైద్యం చేయించుకుంటే తన తల్లి బ్రతుకుతుందని డాక్టర్లు చెప్పారు, కానీ ఆ కుటుంబం దగ్గర అంత డబ్బు లేక ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు,

Comment here