Andhra PradeshEast GodavariNews

పోసాని వ్యాఖ్యల పై మండిపడ్డ ఉంగరాల మణిరత్నం

* పోసాని వ్యాఖ్యల పై మండిపడ్డ ఉంగరాల మణిరత్నం

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  జనసేనాని పవన్ కళ్యాణ్ పై అనుశిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళి క్షమాపణ చెప్పాలని, ఇక నుండి బాధ్యత తో మాట్లాడాలని గోకవరం మండల జనసేన మండల అధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం తెలిపారు.. పోసాని కృష్ణమురళి మాట్లాడిన విధానానికి సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేసారు.
నిత్యావసర సరుకుల ధరలు దారుణంగా పెరిగాయి.. ఏ మంత్రి వాటి గురించి మాట్లాడరు..పెట్రోల్ రేటు అందనంత ఎత్తులో ఉంది. దీనిపై నాయకులు ఆందోళన చేయరు. రోడ్లు నరక కూపంలా ఉన్నాయి.. కనీసం పట్టించుకోవటం లేదు.. ఇలాంటి వాటి గురించి, ప్రజల కోసం మాట్లాడుతున్న జనసేనాని పై విమర్శలు చేయడం సిగ్గు చేటు విషయమని
జనసేన పార్టీ గోకవరం మండల అధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం అన్నారు. జనసేనాని ఆయన సిని కుటుంబ కష్టాలని దాని మీద ఆధారపడి వారి కోసం మాట్లాడటం తప్పా అని ప్రశ్నిస్తున్న. ప్రజా సమస్యలను పక్కన పెట్టి చోద్యం చుస్తున్నారు కొందరు మంత్రులు.. మంత్రి పదవుల కోసం భజన చేసే వారు కొంతమంది బయటకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం ప్రజలు గమనిస్తున్నారు.  కేబినేట్ విస్తిరణలో స్థానం కోసం పోటీలు పెట్టినట్లు అందరూ మీడియా చుట్టూ చేరి విమర్శించడం మొదలుపెట్టారు. వారిని ప్రజలు ఎందుకు గెలిపిచారో మర్చిపోయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. వారియొక్క మంత్రిశాఖకి కూడా ఏమాత్రం న్యాయం జరిగేవిదంగా ఒక్కరు కూడా ప్రజలపక్షాన నిలబడి పని చేసిన తీరులేదు.  వారి జీవితంలో వారికి ప్రజలు అందించిన పదవి గా చూడకుండా, భజన కోసం ఇచ్చిన పదవిగా భావించి,ముఖ్య పదవిని కేవలం అలంకరణగా మాత్రం చూసే వీళ్ళు మా నాయకుడిని అనడానికి సరిపోతారా.. ఒకరేమో మనమంతా ఒకటే కుటుంబం ఏమనుకున్నా పర్వలేదంటారు, మరొకరేమో పవన్ కళ్యాణ్ ఎవరంటారు మరొకరు మరోలా వీళ్ళ మన ప్రజాప్రతినిధులు. వీళ్ళ ఆంధ్రప్రధేశ్ మంత్రివర్యులు. వీళ్ళకా మనం ఓట్లేసి గెలిపించింది అని ప్రజలు సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు. ముందు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్న నిత్యవసర సరుకు ధరల నియంత్రిచే విధంగా కృషి చేయండి ప్రజల మన్నలు పొందండి .పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదని ఉంగరాల స్పష్టం చేశారు.

Comment here