Andhra PradeshEast GodavariNews

పౌష్ఠికాహారం పై గర్బిణి స్త్రీలకు  అవగాహణ అవసరం

*పౌష్ఠికాహారం పై గర్బిణి స్త్రీలకు  అవగాహణ అవసరం*
*సామాజిక కార్యకర్త  డోన్ పి. మహమ్మద్ రఫి*
*సెప్టెంబర్ 1నుండి 7 వరకు జాతీయ పౌష్ఠికాహార వారోత్సవాల  సందర్బంగా*
పౌష్టికాహారం పై  ప్రతి ఒక్కరికి  అవగాహణ అవసరం.
మనిషి ఆహారంలోని పౌష్టిక పదార్ధాలు ప్రతిపాదించిన మోతాదు కంటే నిరంతరంగా తగ్గటం వల్ల పౌష్టికాహార లోపం వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రకారం  ప్రస్తుతం తీవ్రమైన పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు.
గర్బిణిలు -పిల్లలలకు పౌష్ఠికాహారం పూర్తి స్థాయి లో తీసుకోని ఆరోగ్యాలను కాపాడుకొనేందుకు అవగాహణ పెంపోందించుకునేందుకు గాను సెప్టెంబర్ 1నుండి 7వ తారీకు వరకు జాతీయ పౌష్ఠికాహార వారోత్సవాలను జరుపుతున్నారు.
గర్బిణిలు మరియు శిశువులకు  పూర్తిస్థాయి లో పౌష్ఠికాహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడు
కోవలసిన భాద్యత వారి కుటుంబాల పై ఉన్నదని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు.
ప్రస్తుత ఆధునిక యుగం లో ఎక్కువ శాతం గర్బిణిలు రక్తహీనత తో బాధపడుచున్నారని అలాగే పల్లె ప్రాంతంలో నివసించె శిశువులు  పౌష్ఠికాహార లోపంతో అనేక వ్యాధుల తో బాధపడుచున్నరని కొన్ని సర్వేల ద్వారా వెల్లడవుతున్నది. గర్బిణిలు రక్తహీనత తో జన్మనిచ్చె శిశువులు అనారోగ్యానికి గురి అగుచున్నారు.కావున తగు జాగ్రత్తలతో  రక్త హీనత లేకుండా సంపూర్ణంగా పౌష్ఠికాహారాన్ని  తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే  ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాలలో  గర్బిణిలకు మరియు శిశువులకు పౌష్ఠికాహారం అందిస్తుంది.  ప్రజలు అవగాహణ తో పౌష్ఠికాహారాన్ని వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు

Comment here