Andhra PradeshEast GodavariNews

ప్రజలు తిరస్కరించినా మల్లాడికి బుద్ధి రాలేదు

ప్రజలు తిరస్కరించినా మల్లాడికి బుద్ధి రాలేదు-ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానాం నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు మాటలు ప్రజలు నమ్మలేదని పూర్తిగా తిరస్కరించి, తనకు అఖండ విజయాన్ని అందించారని, అయినప్పటికి దిగజారి, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ విమర్శించారు. 23 ఏళ్ళ పాటు నియోజక వర్గానికి ఆయనే ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఇంకా పేదరికం నిరుద్యోగం తాండం చేస్తున్నాయని కానీ తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఐదు నెలల 12 రోజులు మాత్రమే అయినప్పటికీ పలు సమస్యలు పరిష్కరించబడ్డాయి అని, కొత్త పెన్షన్లు, వివిధ ప్రభుత్వ పథకాలు అమలుకు కృషి చేసినట్లు తెలిపారు. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఓర్వలేనితనం వల్లే ఓల్డ్ ఏజ్ హోం ద్వారా జరిగిన పారిశుద్ధ్య పనులు కరోనా సమయంలో అర్ధాంతరంగా నిలిపివేసి తన వక్రబుద్ధిని చాటుకున్నారని, ఎన్ని ఆటంకాలు కలిగించినప్పటికీ పారిశుద్ధ్య పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డిల్లీ ప్రతినిధి పదవిని అడ్డం పెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవాలని చూడడం దారుణమన్నారు. మల్లాడి చేస్తున్న నిరాధార విమర్శల పైన, పత్రిక ప్రకటన పైన శాసనసభాహక్కుల ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. రాజ్యసభ సీటు కోసమే నెలలు తరబడి కొద్ది పుదుచ్చేరిలో మకాం వేసి అందరి కాళ్ళవేళ్ళ పడినప్పటికీ ఎవరూ పట్టంచుకోలేదని ఎద్దేవా చేశారు. తనకు ప్రజాధారణ లభిస్తుండటం సహించలేకే కార్యకర్తల పైన అభిమానులు పైన దాడులు చేస్తున్నారని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆరోపించారు.

Comment here