Andhra PradeshEast GodavariNews

*ప్రజారంజక పాలన చూసి ఓర్వలేకే విమర్శలు-పవన్ వ్యాఖ్యలపై చందన నాగేశ్వర్ ఫైర్*

*ప్రజారంజక పాలన చూసి ఓర్వలేకే విమర్శలు-పవన్ వ్యాఖ్యలపై చందన నాగేశ్వర్ ఫైర్*
రాజమండ్రి:- రాష్ట్రంలో గత రెండున్నరేళ్లుగా సాగుతున్న ప్రజారంజక పాలన ను చూసి ఓర్వలేకనే ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద ఎందుకు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనలో చేసిన నిర్వాకం వల్లే రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా మారాయని అయితే నాడు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న
పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన్ని నిలదీశారు వర్షాలు అధికంగా కురవడం వల్ల రోడ్లు నాశనం అవుతున్నాయని. ఈ విషయాన్ని గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్షాకాలం అనంతరం రాష్ట్రంలోని అన్ని రోడ్లకు మరమ్మతులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.
 అయితే ఈ విషయాన్ని గమనించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానం పేరుతో రోడ్డు మరమ్మతు పనులకు దిగారని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు రోడ్లు బాగు పడతాయ ? అని ఆయన ప్రశ్నించారు. శ్రమదానం పేరుతో షోయింగ్ చేయడం మానుకుంటే మంచిదని సలహా ఇచ్చారు…

Comment here