Andhra PradeshEast GodavariNews

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వైకాపా: కాశి

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వైకాపా: కాశి
రాజమహేంద్రవరం, అక్టోబర్ 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతి, అసమర్థత పై ప్రశ్నిస్తే దాడులకు పాల్పడటం సహించరాని నేరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా జగన్ నుండి ఎమ్మెల్యేల వరకు నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వ్యవహార శైలి  ప్రజాప్రతినిధిగా కాకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
వైకాపా పాలకుల దందాలను ఎత్తి చూపిస్తే రౌడీలతో దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలవరపరచిన కాకినాడ పోర్టులో మాదక ద్రవ్యాల దిగుమతి పై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని నవీన్ డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే ద్వారంపూడి తన వ్యవహారశైలీ మార్చుకోకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరించారు.ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ లోపాలు,అక్రమాలను ఎత్తి చూపడం తమ బాధ్యత అని,దానిని సహించలేక దాడులకు దిగడం దారుణమన్నారు.

Comment here