Andhra PradeshEast GodavariNews

 ప్రభుత్వం అసమర్ధత… అవ్వాతాతలకు తెలుగుదేశం పార్టీ బాసట

 ప్రభుత్వం అసమర్ధత… అవ్వాతాతలకు తెలుగుదేశం పార్టీ బాసట
– పెన్షన్లు కోల్పోయిన అవ్వాతాతలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది
– పెన్షన్లు పంపిణీతో వినూత్న కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం
రాజమహేంద్రవరం సిటీ :
గడియకో నిర్ణయం… క్షణానికో పథకం రద్దు అనే రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి నిర్ణయాలు ఉంటున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మండిపడ్డారు. గాంధీ జయంతిని పురష్కరించుకుని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని టీడీపీ 25వ డివిజన్ కమిటీ సభ్యులు ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఆ డివిజన్లో ఇటీవల పెన్షన్లు కోల్పోయిన అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఆదిరెడ్డి వాసులు ముఖ్య అతిధులుగా హాజరై ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్ తుగ్లక్ నిర్ణయాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే పెన్షన్ సొమ్ము ఆసుపత్రి, మందుల ఖర్చులతో పనికొస్తాయని ఆశగా ఎదురు చూసే అవ్వాతాతలకు ఆ పెన్షన్ను కూడా దూరం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సిగ్గు చేటన్నారు. జగన్మోహన్రెడ్డి సంపద సృష్టించలేక… నవరత్నాలకు నవరత్న అయిల్ పూసి మూలన పడేశారని విమర్శించారు. అవ్వాతాతల ఇబ్బందులను గుర్తించిన 25వ డివిజన్లోని తమ పార్టీ కమిటీ సభ్యులు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని,  ఐదుగురి తో ప్రారంభిస్తే 50 మంది వరకూ చేరిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ ఈ మంచి కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అదిరెడ్డి, 25వ వార్డు కమిటీ సభ్యులు అవ్వాతాతలకు హామీ ఇచ్చారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కమిటీ సభ్యులు తవ్వా రాజా, అడ్డగర్ల ఆనంద్, గుణవర్తి శివ, అర్లపల్లి శ్రీనివాస్, వంగా సత్యనారాయణ, గోకవరపు బుజ్జమ్మ, ముత్యాల శ్రీను, కానూరు సూర్యకుమారి, వెంకటలక్ష్మి, కర్రి కాశి విశ్వనాధ్, మేరి, వాసు, చొక్కాకుల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Comment here