Andhra PradeshEast GodavariNews

ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రం అధోగతిపాలు

ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రం అధోగతిపాలు
మాజీ ఎమ్మెల్యే బండారు
కోస్తా ఎన్ కౌంటర్, రావులపాలెం
రాష్ట్రంలో, కొత్తపేట నియోజకవర్గంలో అడ్డగోలు విధానాలు దోపిడీ తత్వంతో పరిపాలన చేస్తున్నారని రాష్ట్ర టీడీపీ,  ఉపాధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు విమర్శించారు.
రావులపాలెం మండల తెలుగు దేశం పార్టీ సమావేశం గుత్తుల పట్టాభి రామారావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్రంలో  చీకటి రోజులు వచ్చాయని విద్యుత్ కోతలకు ప్రభుత్వమే కారణమన్నారు. పేదలకు పధకాలు తొలగిస్తున్నారని అన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధికి సమస్యలు పట్టడం లేదన్నారు. రావులపాలెంలో కాంట్రాక్టర్లు దయనీయ పరిస్థితిలో ఉన్నారన్నారు.
భూకబ్జాలకు రావులపాలెంను కేంద్రంగా మార్చేశారన్నారు.
ధరలు పెరుగుదల పేదలకు మారిందన్నారు, ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలో వస్తుందన్నారు..
రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ పై జగన్మోహనరెడ్డి గారి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాపులకు గత ప్రభుత్వం మేలు చేసిందని ఈ ప్రభుత్వం ఉన్నవి తీసేసిందన్నారు.
నూతనంగా ఎన్నికైన ఈతకోట సర్పంచ్ యర్రంశెట్టి సుబ్బలక్మి, వెదిరేశ్వరం ఎంపీటీసీ,  గంటా సుబ్బారావు, కేతరాజుపల్లి ఎంపీటీసీ శాంత కుమారి,పొడగట్లపల్లి ఎంపీటీసీ నాగజ్యోతిలను సత్కరించారు.
రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ , రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి దండంగి మమత లను సన్మానించారు ఈ సమావేశ కార్యక్రమంలో మాసాబత్తుల ఆనందరావు, చిలువూరి సతీష్ రాజు, ముత్యాల బాబ్జి, యల్లమిల్లి జగన్మోహన్, కంఠంశెట్టి శ్రీనివాసరావు, జక్కంపూడి వెంకటస్వామి, వెలగల శ్రీనివాస రెడ్డి, సయ్యపరాజు రామకృష్ణ రాజు, అధికార నాగు, రామకృష్ణ రాజు  కేతా శ్రీను,కాస సాగర్, నందం సూరిబాబు, దాట్ల రాకేష్ వర్మ, మైగాపుల రవితేజ, బోడపాటి మారుతి, తదితరులు పాల్గొన్నారు.

Comment here