Andhra PradeshEast GodavariNews

ప్రాణాలు తీసిన సెల్ఫీ…

ప్రాణాలు తీసిన సెల్ఫీ…
కోస్తా ఎన్ కౌంటర్ ,  రంపచోడవరం : తూర్పు ఏజెన్సీ రంపచోడవరం మన్యం ప్రాంతానికి విహార యాత్ర కోసం వచ్చిన ఒక బృందం లోని వ్యక్తి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం లో ప్రమాదవశాత్తు కాలువ పడటంతో మృతి చెందిన ఘటన రంపచోడవరం ఏజన్సీ లో చోటుచేసుకుంది. బందువుల  కధనం ప్రకారం రంపచోడవరం   మండలం ఐ పోలవరం లో  కాలువ వద్ద చరవాణి తో స్వీయ చిత్రం తీసుకుంటుండగా అన్నవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ(19) అనే యువకుడు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు యువకుడు మండలం లో ఒక  కళాశాల  లో బిఫాంస్సీ  చదువుతున్నాడు.ఘటనపై సమాచారం అందుకున్న రంపచోడవరం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయం తో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రంపచోడవరం సిఐ త్రినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comment here