Andhra PradeshEast GodavariNews

ఫ్యాకల్టీ అసోసియేట్ గా జి.అశోక్

ఫ్యాకల్టీ అసోసియేట్ గా జి.అశోక్

ఆదికవి నన్నయ యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్ కు ఫ్యాకల్టీ అసోసియేట్ గా గణిత విభాగం అధ్యాపకులు జి.అశోక్ ను నియమిస్తూ వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు ఉత్తర్వులను అందించారు. సోమవారం వీసీ కార్యలయంలో ఉత్తర్వులను అందించి అశోక్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ కంప్యూటర్ సెంటర్ ఎంతో కీలకమైనదని సమర్థవంతంగా సేవలందించాలన్నారు. కంప్యూటర్ సెంటర్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలలో సహాయపడాలని తెలిపారు. ధృవీకరణ పని చేస్తున్న అధ్యాపకులకు సహాయం చేయాలన్నారు. కంప్యూటర్ సెంటర్ యొక్క వ్యత్యాసాల ధృవీకరణ పనిని వేగవంతం చేయడానికి సహాయపడాలన్నారు. అప్పగించిన బాధ్యతలను త్రికరణశుద్దిగా నిర్వహిస్తూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి పాటుపడాలని తెలియజేసారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, గణిత విభాగ అధ్యాపకులు అశోక్ కు శుభాకాంక్షలను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రిజిష్ట్రార్ ఆచార్య టి.అశోక్, ప్రిన్సిపాల్ డా.వి.పెర్సిస్, హర్షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comment here