Andhra PradeshEast GodavariNews

బండారును కలిసిన జనసేన ఎంపీటీసీ

బండారును కలిసిన జనసేన ఎంపీటీసీ బొరుసు సీతారత్నం సుబ్రహ్మణ్యం దంపతులు..
కోస్తా ఎన్ కౌంటర్. రావులపాలెం. జెడ్పిటిసీ ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ప్రతీ చోట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి వీచిన కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండలంలోని ఈతకోటలో ఒన్ ఎంపీటీసీ జనసేన పార్టీ కైవసం చేసుకుంది గ్రామానికి చెందిన బొరుసు సీతారత్నం 260 ఓట్లు మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు సోమవారం ఉదయం కొత్తపేట మండలంలోని వాడపాలెంలో జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జి బండారు శ్రీనివాసరావును నూతనంగా ఎన్నికయిన ఎంపీటీసీ బొరుసు సీతారత్నం సుబ్రహ్మణ్యం దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సీతారత్నం మాట్లాడుతూ నాపై నమ్మకంతో పార్టీ టిక్కెట్ ఇచ్చి ప్రోత్సహించిన పార్టీ పెద్దలకు విజయాన్ని కట్ట బెట్టిన ప్రజానీకానికి పార్టీకోసం నిరంతరం పని చేసిన జన సైనికులకు జన సేవకులకు వీర మహిళలకు ధన్యవాదాలు తెలిపారు అందరి సహాయ సహకారాలతో గ్రామాభివృద్ధికి ఎల్లపుడు పాటు పడతానన్నారు

Comment here