Andhra PradeshEast GodavariNews

బీజేపీ మహా దర్నా

పార్లమెంట్ జిల్లా – రాజమహేంద్రవరం
     ప్రధాని శ్రీ నరేంద్ర అ మోడీ గారు “హౌసింగ్ ఫర్ ఆల్ ” (అందరికీ ఇల్లు) అన్న నా ఆశయం తో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాసియోజన లో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన 20 లక్షల ఇండ్లను కేటాయించడం లోనూ,  నిర్ణయించడం లోనూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు బిజెపి రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు శ్రీ పరిమి రాధాకృష్గగారి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ వారి కార్యాలయం వద్ద సుమారు 600 మంది కార్యకర్తలు బాధితులతో మహాధర్నా నిర్వహించడం జరిగినది.  ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు శ్రీ బొమ్ముల దత్తు , కోడూరి లక్ష్మీనారాయణ, శ్రీమతి తారెట్ల చింతాలమ్మలు పాల్గొన్నారు .
     ఈ సందర్భంగా ముఖ్యఅతిథి శ్రీమతి రేలంగి శ్రీదేవి మాట్లాడుతూ ప్రధానమంత్రి దేశంలో ప్రతి పేదవాని సొంత ఇంటి కల సాకారం అయ్యేవిధంగా మన రాష్ట్రానికి లక్షలాది ఇండ్లు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇండ్ల నిర్మాణాలు పైన పూర్తి అయిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించడంపైన  ఇండ్ల నిర్మాణాన్ని కి నిధులు కేటాయించడంపైన నిర్లక్ష్యం వహిస్తూ ఈ పథకాన్ని నిర్విర్యం  చేస్తున్నది . కావున తక్షణమే ప్రభుత్వం మేల్కొని లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేయవలసినదిగాను  లేనిపక్షంలో బిజెపి తీవ్రంగా ఉగ్రిస్తున్నదని అన్నారు. అధ్యక్షులు శ్రీ పరిమి రాధాకృష్ణ మాట్లాడుతూ గత  ప్రభుత్వ హయాం లో Tidco ఇండ్ల పేర్లతో పూర్తి కాబడిన ఇళ్లను ఇంతవరకు ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు అంద చేయలేదని వెంటనే వారికి అందజేయాలని ముంపు ప్రాంతాలలో స్థలాలను కేటాయించినందున ఆ ప్రాంతాలలో పట్టాలను రద్దు చేసి  మెరుగైన ప్రాంతాలలో పట్టాలను ఇచ్చి వారికి ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిర్మించి ఇవ్వాలని, నిర్మాణం మధ్యంతరంగా ఆగిపోయిన ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదల చేసి వాటి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు .
  ఈ కార్యక్రమంలో అడబాల రామకృష్ణారావు, టిక్కి నాగేంద్ర, సింహాద్రి సత్యనారాయణ, గుర్రాల వెంకట్రావు,  ఏ పి ఆర్ చౌదరి,  పొట్లూరి రామ మోహన్ రావు , వీర  వీరాంజనేయులు , తంగెళ్ల పద్మావతి, డాక్టర్ అనురాధ, కాలేపు సత్య సాయిరాం, కొరగంటి  సతీష్, కందుకూరి మనోజ్,బేతిరెడ్డి ఆదిత్య ,సత్య కుమార్,పినిపే గంగరాజు, Z A Beg, చింతపల్లి సతీష్ , అడబాల గణపతి, ఒంటెద్దు స్వామి, భాస్కర్, పి . మురళి కృష్ణ,  వీరగంట భానుమతి, కొత్తపల్లి గీత, కొయ్య వెంకటలక్ష్మి ,పి. సూర్య ప్రభావతి, భువన,  పవన్ కుమార్, బండి ప్రసాద్, మంచెం విజయ్ కృష్ణ, పిల్లాడి రుద్రయ్య , మన్యం శీను, తంగెళ్ల శ్రీనివాస్,యనాపు  యేసు ,కొటికలపూడి వెంకటేశ్వరరావు , ముత్యాలరావు,  శెట్టిపల్లి నాగరాజు, కొల్లాపు శీను,నందివాడ సత్యనారాయణ, రాయుడు వెంకటేశ్వరరావు తో పాటుగా 7 అసెంబ్లీ లో నుండి పోలింగ్ బూత్ స్థాయి వరకు గల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది . ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ వారికి అందజేయడం జరిగింది .
      అడబాల రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి,  జిల్లా మీడియా ఇంచార్జ్ వీర వీరంజనేయులు

Comment here