Andhra PradeshEast GodavariNews

బీసీలకు సముచిత స్థానం కల్పించిన మంత్రి పై నీతిమాలిన వ్యాఖ్యల

బీసీలకు సముచిత స్థానం కల్పించిన మంత్రి పై నీతిమాలిన వ్యాఖ్యల
…మంత్రి పై అనుచిత వ్యాఖ్యలపై చిన్న క్షమాపణ చెప్పాలి
… శెట్టి బలిజ సామాజిక నాయకుల డిమాండ్
కోస్తా ఎన్ కౌంటర్, సర్పవరం: రాష్ట్రంలోని ఆరు శాఖలను సమర్థవంతంగా పరిపాలన చేస్తూ రూరల్ నియోజకవర్గంలో సామాజిక న్యాయం చేస్తూ అందరికీ పదవులు ఇచ్చిన రాష్ట్ర మంత్రివర్యులు కురసాల కన్నబాబు పై బీసీ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని ఎల్ల బోయిన చిన్న చేసిన వ్యాఖ్యలపై కాకినాడ రూరల్ మండలం బీసీ నాయకులు ఖండించారు. గురువారం నాడు జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ  కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసి రామకృష్ణ మాట్లాడుతూ పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి వర్యులు కురసాల కన్నబాబు పాల్గొన్న సమయంలో రాయుడు నాగేశ్వర్రావు ఇంటి వద్ద టీ తాగుతున్న వారి ఒకటో వార్డు నాయకులు వారిస్తూ  సత్తెమ్మ తల్లి గుడి విషయంలో మంత్రివర్యుల పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గుడి విషయంలో మూడు సామాజిక వర్గాలను కూర్చుండబెట్టి గుడి నిర్మాణం చేపడతామని మంత్రివర్యులు తెలపడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో బీసీలకు శెట్టి బలిజ డైరెక్టర్లుగాను, మార్కెట్ కమిటీ చైర్మన్ గాను, జడ్పీటీసీ పదవులను కట్టబెట్టి నాయకుల పై అనుచిత వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. దీనికి కాకినాడ రూరల్ మండలంలోని శెట్టిబలిజ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను మాట్లాడుతూ మంత్రివర్యులు కురసాల కన్నబాబు తో గత పాతికేళ్లుగా రాజకీయ పరిచయాలు ఉన్నాయని, ఏనాడు కుల ప్రస్తావన గాని సామాజిక బేదాలు గాని  చూపించలేదని పేర్కొన్నారు. కానీ ఎల్ల బోయిన చిన్న సామాజిక వర్గాల పేరుతో మంత్రి పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని శెట్టిబలిజ సంఘం నాయకులు అంతా డిమాండ్ చేయడం  జరుగుతుందన్నారు. గుడి నిర్మాణంలో మంత్రివర్యులు దేవాదాయ శాఖ అధికారులతో వివిధ సామాజిక వర్గాల నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని చెప్పగా, వాటిపై నాయకులంతా గుడి నిర్మాణం  కృషి చేయడం జరుగుతుందన్నారు.

Comment here