Andhra PradeshEast GodavariNews

బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి

బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
కోస్తా ఎన్‌కౌంటర్‌ పెంటపాడు : బీసీ కులాల గణనపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ఏపీ బీసీ చైతన్య సమితి జిల్లా ఉపాధ్యక్షుడు పొట్నూరి చంద్రశేఖర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర బీసీ చైతన్య సమితి పిలుపు మేరకు మండలంలోని పడమరపవిప్పర్రు గ్రామంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన తెలంగాణాలోనూ బీసీ కులాల జన గణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. అలాగే, మన రాష్ట్రంలోనూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ చైతన్య సమితి అధ్యక్షుడు చింతాడ మురళీ, సభ్యులు డోకల సుబ్బారావు, మామిడి ఏసు తదితరులు పాల్గొన్నారు.

Comment here