Andhra PradeshEast GodavariNews

బొబ్బర్లంక గ్రామ సచివాలయాన్బి ఆకస్మిక తనిఖీ

బొబ్బర్లంక గ్రామ సచివాలయాన్బి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ మరియు ఆసరా) శ్రీ A. భార్గవ తేజ IAS
కోస్తా ఎన్ కౌంటర్  ఆత్రేయపురం మండలం లోని బొబ్బర్లంక గ్రామ సచివాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్(హౌసింగ్ & ఆసరా) శ్రీ ఏ.భార్గవ తేజ IAS ఆకస్మిక తనిఖీ చేసారు..ముందుగా నిర్మాణం లో ఉన్న సచివాలయ భవనాన్ని పరిశీలించి, త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు ను, సంక్షేమ క్యాలెండర్‌ అమలు తీరును, రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయ సర్వీసు లను పరిశీలించి, గ్రామంలో స్వచ్చ సంకల్పం ద్వారా అమలు చేస్తున్న క్లాప్ కార్యక్రమం గురించి, గ్రీన్ అంబాసిడర్ ల వినియోగం గురించి సెక్రటరీ హనుమ మరియు సర్పంచి నరాలశెట్టి సుబ్బలక్ష్మి ని అడిగి,అవసరమైన సూచనలు తెలిపారు.. గ్రామంలో హౌసింగ్ ప్రోగ్రామ్ పురోగతి,ఇళ్ల స్థలాల పంపిణీ, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు తదితర పధకాల అమలు గురించి వెల్ఫేర్ అసిస్టెంట్,సెక్రటరీ,వీఆర్వో మరియు వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ తో పాటు ఎంపీడీఓ నాతి బుజ్జి, తాహశిల్దార్ ఎం రామకృష్ణ, హౌసింగ్ డిఈ ప్రసాద్, సెక్రటరీ శివరామకృష్ణ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఉన్నారు

Comment here