Andhra PradeshEast GodavariNews

బ్రహ్మచారిణిగా వీరంపాలెం బాలాత్రిపురసుందరిదేవి

కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : రూరల్‌ మండలంలోని వీరంపాలెం శైవక్షేత్రంలో వేంచేసియున్న శ్రీబాలాత్రిపుర సుందరీ అమ్మవారిని శుక్రవారం శ్రీదేవీ శరన్నవరాత్రులు రెండవ రోజు బ్రహ్మచారిణిగా అలంకరించారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తుంటారు. ఈ క్రమంలోనే బ్రహ్మచారిణిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారిని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. పట్టణంలోని శంకరమఠంలో వేంచేసియున్న సర్వమంగళాదేవిని, ముత్యాలంపురంలోని శ్రీముత్యాలమ్మవారిని బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజలందించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మాకా బాలాజీ, ఆలయ మేనేజర్‌ నామా సూర్యప్రకాశరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. పట్టణంలోని 17వ వార్డు విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని ఉత్సవమూర్తి విశ్వదుర్గేశ్వరిగాను, విశేషాలంకారం గౌరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ గొర్రెల శ్రీధర్‌ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. కూనిరెడ్డి ప్రసాద్‌ ` విమల, తాడి వెంకటనరసింహమూర్తి ` పద్మావతి దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు రోడ్డులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో అమ్మవారిని రెండవ రోజు ఉ త్సవ మూర్తి కాశీ అన్నపూర్ణగాను, విశేషాలంకారం సావిత్రిదేవిగాను అలంకరించారు. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ల ఆలయాలకు తరలివచ్చారు.

పెంటపాడు మండలంలో…:
మండలంలోని ప్రత్తిపాడు వై.జంక్షన్‌లో వేంచేసియున్న కనకదుర్గమ్మవారు శ్రీబాలాత్రిపుర సుందరదేవిగా అలంకరించారు.ఆలయ ఈవో చంద్రశేఖర్‌, ధర్మకర్తలు సైపిరెడ్డి రాంబాబు, జవ్వాది శేషగిరి, కాసాని శ్రీనివాస్‌, అర్చకులు కొత్తలంక శివసత్యనారాయణ పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు.

Comment here