Andhra PradeshEast GodavariNews

*భవాని మాలధారులు విజయవాడకు పాదయాత్ర*

*భవాని మాలధారులు విజయవాడకు పాదయాత్ర*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మండల కేంద్రమైన రాయవరంకు చెందిన భవాని మాలధారులు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు సోమవారం పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. గ్రామానికి చెందిన కొట్టేడి శివ , కోయిన సాయి మణికంఠ, ర్యాలి రామకిషోర్, కొలమూరి నాని,బలగం సూర్య తేజ, భవాని దీక్ష చేపట్టి, కాలి నడకన వెళ్లి కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాలని సంకల్పించుకున్నట్లు తెలిపారు. రాయవరం నుండి విజయవాడకు కాలి నడకన చేరుకునేందుకు సుమారు ఐదు రోజులు పడుతుందన్నారు.భవానీ లకు గుడాల సూరిబాబు గురు భవాని, వార్డు సభ్యురాలు రెడ్డి పైడమ్మ, రొంగల సాయి, రావాడ శీను, అబ్బిరెడ్డిఈశ్వరరావు, తాడి సంతోష్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Comment here