Andhra PradeshEast GodavariNews

భాజపా ఆద్వర్యంలో గణపతి మట్టి బొమ్మలు పంపిణీ  

భాజపా ఆద్వర్యంలో గణపతి మట్టి బొమ్మలు పంపిణీ

రామచంద్రపురం  భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇళ్ళ వెంకటేశ్వరరావు 1000 మట్టి విగ్రహాలు మరియు 1000 వినాయక వ్రత కథ పుస్తకములు గురువారం రామచంద్రపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా టౌన్ అధ్యక్షుడు యాం డ్ర బుల్లి అబ్బులు అధ్యక్షతన ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఇళ్ళ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ  మతపరమైన కార్యక్రమాలు నిరోధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలియజేస్తూ బిజెపి పోరాట ఫలితం ప్రజా విజయం గణేష్ ఉత్సవాలకు అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సనాతన హిందూ సంస్కృతి సంప్రదాయాలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు వెంకటేశ్వరరావు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో ట్రేడర్స సెల్ కన్వీనర్ కొట్టి వాడ హరిబాబు, రామచంద్రపురం రూరల్ అధ్యక్షుడు ఆకేటి శ్రీకృష్ణ చిలుకూరి రామకృష్ణ, గుబ్బల శ్రీనివాసు సలాది సతీష్ నాయుడు,రామకృష్ణ , రాజేశ్వరి, పట్నాల కాశీ విశ్వనాథం పసుపులేటి వీరభద్రరావు మొదలగు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comment here