Andhra PradeshEast GodavariNews

భారత్‌ బంద్‌ విజయవంతం

భారత్‌ బంద్‌ విజయవంతం
తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రదర్శన నిర్వహిస్తున్న వామపక్షాలు, ఏఐటీయుసీ, తెలుగుదేశం, కాంగ్రెస్‌ తదితర సంఘాల నాయకులు…

కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : వివిధ రైతు, ప్రజాసంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం పట్టణంలో నిర్వహించిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. తొలుత వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జయలక్ష్మి సెంటర్‌ నుంచి తాలూకాఫీస్‌ సెంటర్‌, హౌసింగ్‌ బోర్డు వరకు ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు భారత్‌ బంద్‌కు మద్దతుగా ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జీ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను, 2020 విద్యుత్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గొర్రెల శ్రీధర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. అనంతరం వామపక్షాల ప్రదర్శనలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే, ఏఐటీయుసీ, సీఐటీయు, ఇఫ్టూ, ఐఎన్‌టీయుసీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయుసీ జిల్లా గౌరవాధ్యక్షుడు డి.సోమసుందర్‌ నాయకత్వం వహించారు. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ నర్సాపురం జిల్లా అధ్యక్షుడు మార్నీడి బాబ్జీ, ఇఫ్టూ జిల్లా కార్యదర్శి మామిడి దానవరప్రసాద్‌, సీఐటీయు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, ఏఐటీయుసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఓసూరి వీర్రాజు, ఐఎన్‌టీయుసీ పట్టణాధ్యక్షుడు బాలబొమ్మల శ్రీనివాస్‌, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దాసరి కృష్ణవేణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు బడుగు వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు మండల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పెంటపాడులో…:
భారత్‌ బంద్‌ పెంటపాడు మండలంలో సోమవారం విజయవంతమైంది. సీపీఎం, సీపీఐ, తెలుగుదేశం, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ రంగ సంస్థలను, షాపులను మూయించివేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి ఆదాయ వనరులుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్‌ వారికి పెట్టుబడిదారులు అతి చౌకగా తెగనమ్ముతున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా వదల్లేదన్నారు. రైతు, ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కన్వీనర్‌ చిర్ల పుల్లారెడ్డి, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు సిరపరపు రంగారావు, బంకురు నాగేశ్వరరావు, పెనగంటి దుర్గ, సీపీఐ మండల కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, బండారు శ్రీను, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, బుద్దన ధనరాజు, నల్లమిల్లి గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comment here