Andhra PradeshEast GodavariNews

భారత్ బంద్ విజయవంతం

భారత్ బంద్ విజయవంతం

– పాల్గొన్న అఖిలపక్షం న్యూ డెమోక్రసీ,సీపీఐ,సీపీఎం,టీడీపి,కాంగ్రెస్
కోస్తా ఎన్ కౌంటర్ వేలేరుపాడు:కేంద్ర ప్రభుత్వం చీకటి రైతు చట్టాలు,విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు నిరసనగా జాతీయ అఖిల పక్షం పిలుపు మేరకు సోమవారం వేలేరుపాడు లో అఖిల పక్షం బంద్ విజయవంతం చేశారు.దుకాణాలు,ఆటోలు శ్వంచంధంగా సహకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 చీకటి చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దేశం లోని ప్రభుత్వ ఆస్తులు,విశాఖ ఉక్కు ను ప్రవేటి కరణ పేరుతో బడా బాబులకు అమ్మలని చూస్తుందని దుయ్యబట్టారు.కేంద్రం వెంటనే చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో భవిష్యత్తులో అఖిల పక్షం తరుపున ఉద్యమాలు ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం ఎల్ గుంటూరు డివిజన్ అధ్యక్షుడు ఎండీ.గౌస్, పురెం. లక్ష్మయ్య,రామారావు, సీపీఐ మండల కార్యదర్శి సన్నేపల్లి.సాయిబాబు,కారం.దారయ్య,బాడిస.రాము,యర్రా.మధు, సీపీఎం మండల కార్యదర్శి మాడివి.దుర్గారావు,దర్ముల.రమేష్,
తెలుగుదేశం మండల అధ్యక్షుడు అమరవరపు.అశోక్,కొమ్మని. వేంకటేశ్వర రావు,స్యకమురి.సంజివులు,సుధాకర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి.సత్యనారాయణ,శంకరం, మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు మాచర్ల.హరిబాబు,బుడి పిటి. జాన్ బాబు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comment here