Andhra PradeshEast GodavariNews

భారత్ బంద్ సంపూర్ణం

భారత్ బంద్ సంపూర్ణం

కోస్తాఎన్ కౌంటర్, రామచంద్రపురం:  రైతాంగ, కార్మిక, విద్యార్థి వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని , సీపీఐ ఎం- ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ,అఖిల భారత రైతు కూలీ సంఘం, పీ డీ ఎస్ యూ  ఆధ్వర్యంలో  సంపూర్ణంగా భారత్ బంద్ జరిగిందని  ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా నాయకులు జి. సూరిబాబు పేర్కొన్నారు. వ్యవసాయ రంగం లో నూతన సాగు చట్టాలు ను రద్దు చేయాలని, కార్మిక రంగంలో లేబర్ కోడ్ లను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ బిల్లును వెనక్కు తీసుకోవాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కు రైతులు, కార్మికులు పిలుపు నిచ్చారు.రైతులు, కార్మికులు కు స్ఫూర్తి కామ్రేడ్ భగత్ సింగ్ 114వ జయంతి కాబట్టి భారత్ బంద్ కు నేడు పిలుపు నిచ్చారన్నారు. ఆయన స్పూర్తితో దేశంలో నేడు నల్ల దొరలుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు. నాడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్ లాంటి మహనీయులు తెల్ల దొరలుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే , నేడు బీజేపీ, ఆర్ ఎస్ ఎస్,అంబానీ, అదాని లాంటి నల్ల దొరలు, గజ దొంగలు దేశాన్ని దేశ భక్తి పేరు తో అమ్మేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను తీసుకుని వచ్చి రైతాంగం దగ్గర నుండి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలుచేస్తుందన్నారు. ఢిల్లీలో  రైతులు గత 9నెలలు నుంచి  నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. 550మంది దేశానికి తిండి పెట్టె రైతులు చనిపోయారు. దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే వహించాలని అన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కును, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని బీజేపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని అన్నారు. రిజర్వేషన్లు రద్దు కోసం ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రైవేట్ పరం చేస్తుంది. బి ఎస్ ఎన్ ఎల్, ఆంధ్ర బ్యాంక్, రైల్వేలు లాంటి సంస్థలు కనుమరుగు చేస్తుంది. ఈ కరోనా కాలం లో సామాన్య ప్రజలు, పేద, మధ్యతరగతి వర్గం చితికిపోయింది. ప్రజలు ను ఆదుకోవాల్సిన ప్రభుత్వ లు పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యులను నడ్డి విరుస్తున్నారన్నారు. దేశంలో ఉపాధి లేని ప్రజలు కు ఉపాధి కల్పించాలని, బీజేపీ ప్రభుత్వం సమ్మె హక్కును, జీవించే హక్కును కాలరాస్తుందని అన్నారు. భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర్య సమర యోధులు అతి చిన్న వయసు లో మాతృ దేశం కోసం తమ విలువైన ప్రాణాలను అర్పించారని అన్నారు. కామ్రేడ్ భగత్ సింగ్ స్పూర్తితో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. రాముడు, రాంబాబు, గణేష్, రాజు, సత్తిబాబు, వెంకటేశ్వరరావు ,కుమారి తదితరులు పాల్గొన్నారు

Comment here