Andhra PradeshEast GodavariNews

భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 25

భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలోని ప్రజలందరికి మత స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కు ఉన్నప్పటికి మనదేశంలో అమలు జరగటం లేదని దీనిని వెంటనే అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కొనసీమలోని పోస్టర్లు అంతా కలిసి శనివారం అమలాపురంలో సమావేశం నిర్వహించారు. అమలాపురం ఆర్డీవో ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి వినతిపత్రం అందించారు  దేశంలోని 9 రాష్ట్రాల్లో హిందూ మతం నుండీ వేరే మతంలోకి మారితే 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విడిస్తున్నారని మాట స్వేచ్ఛ ఉన్న దేశంలో జరగటం బాధాకరం అన్నారు భారత రాష్ట్ర పతి వెంటనే దేశంలో ఉన్న ఎస్సి,ఎస్టీ ప్రజల స్వేచ్ఛ హక్కులు హరించి మాన, ప్రాణాలకు రక్షణకు భద్రత లేకుండా చేస్తున్న చట్టాలు రద్దు చేసి నిర్భయంగా మత మార్పిడి చేసుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించి నందున దాన్ని చట్టం చేయాలని కోరుతూ అల్ ఇండియా ప్రేయర్ అండ్ అప్పీల్ చీఫ్ కో ఆర్డినెటర్ డాక్టర్ దొమ్మేటి రాజా సతీష్, డాక్టర్ పల్లా స్టీవెన్స్, సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ దొమ్మేటి సుధాకర్,రెవరెండ్ బొంతు రాజేష్ లతో కూడిన ప్రతినిధి బృందం అమలాపురంలో ప్రదర్శన చేసి ఆర్డీవో పరిపాలన అధికారిణి వెంకటేశ్వరికి వినతిపత్రం అందజేశారు.

Comment here