Andhra PradeshEast GodavariNews

*మండల కేంద్రమైన రాయవరం లో డెంగ్యు కలకలం*

*మండల కేంద్రమైన రాయవరం లో డెంగ్యు కలకలం*

*విషయం తెలుసుకుని ఉలిక్కిపడ్డ వైద్య ఆరోగ్య సిబ్బంది*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం*:*మండల కేంద్రమైన రాయవరం లో ఒకే వీధిలో రెండు డెంగ్యూ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది ఉలికిపాటుకు గురయ్యారు. గ్రామంలో దుర్గ కాలనీ లో ఒక మహిళతో పాటుఒక యువకుడికి జ్వరం రావడంతో వారు ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా, వారికి డెంగ్యూ లక్షణాలు బయట పడడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమై జ్వరం బాధితుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. పరిసరాలను పరిశీలించారు. పీహెచ్సీ వైద్యాధికారిణీ అంగర దేవి రాజశ్రీ, డివిజన్ సబ్ యూనిట్ ఆఫీసర్ ఎన్ వి. సత్యనారాయణ, ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఈ ఓ పి ఆర్ డి బి. అశోక్ కుమార్, పంచాయతీ కార్యదర్శి అత్తిలి గోవిందరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వర బాధితులను పరామర్శించారు. దీనిపై పిహెచ్ సి వైద్య అధికారిణిని వివరణ కోరగా బాధితుల నుండి రక్త నమూనాలు సేకరించి, పరీక్ష నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి పంపించామన్నారు. మహిళా బాధితురాలి ఇంటిలో ఫ్రిడ్జ్ కింద ఉన్న తొట్టెలో డెంగ్యూ దోమ లార్వా గుర్తించినట్లు తెలిపారు.ఆ వీధిలో బ్లీచింగ్ చెల్లించామని, అన్ని ఇళ్లల్లో దోమల నివారణ మందు పిచికారి చేయడంతో పాటుగా  ఫాగింగ్ కూడా చేస్తున్నామన్నారు. వారం రోజుల పాటు ప్రత్యేక వైద్య య శిబిరం నిర్వహిస్తామన్నారు, ఫీవర్ సర్వే నిర్వహించడంతోపాటు డెంగ్యూ బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. డాక్టర్ వెంట ఎం పి హెచ్ ఎస్ జె.శంకర్, ఏ ఎన్ ఎమ్ కె. అనురాధ, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

Comment here