Andhra PradeshEast GodavariNews

మడ అడవుల్లో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడి

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజవర్గ తాళ్లరేవు మండల పరిధిలోని కోరంగి పంచాయతీ చినబొడ్డు వెంకటాయపాలెం సమీపంలోని మడ అడవుల్లో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడి చేసి 9200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు….
కాకినాడ ఎస్ఓ డీపీఓ వి.భీమారావు పర్యవేక్షణలో కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, కోరంగి ఎస్సై ఎస్.రాము మరియు సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై ఎస్. రాము మాట్లాడుతూ నాటుసారా ను అరికట్టాలంటే యువకులు, పరిసర ప్రాంత ప్రజలు ముందుకు రావాలని కోరారు.పలుచోట్ల నాటుసారా బట్టీలను ధ్వంసం చేసి 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

Comment here