Andhra PradeshEast GodavariNews

మహిళలకు పూర్తి రక్షణ దిశ

*మహిళలకు పూర్తి రక్షణ దిశ*
మహిళలు పూర్తి రక్షణ తో సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశ్యం తో దిశా చట్టాన్ని పెట్టారని, మీ అందరి భద్రత కు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రాజమండ్రి 1టౌన్ సీఐ గోవిందరాజు అన్నారు. శుక్రవారం స్థానిక నెహ్రూనగర్ బిలాల్ షాదీఖాన ఆవరణలో మహిళలకు సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఐ గోవిందరాజు  మాట్లాడుతూ మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వెంటనే మాకు తెలియపర్చాలని, మీ పిల్లల నడవడిక పై తల్లులు ద్రుష్టి పెట్టాలని, ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినట్లు తెలిస్తే సమాచారం అందించాలని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపించిన సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేసంలో ఎస్ఐ వెంకయ్య, స్థానిక పిఎంపి వైద్యులు బళ్లా శ్రీనివాస్ ప్రసంగించారు. బ్లూ క్రాట్ నాగరాజు, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీలు ప్రియదర్శిని, సిరి చందన, శానిటేషన్ సెక్రటరీ రాజేష్ కుమార్, వార్డ్ వాలంటీర్స్ మహిళలు హాజయయ్యారు.

Comment here