Andhra PradeshEast GodavariNews

మహిళలను లక్షాధికారులను చేయడమే జగన్ సర్కార్ లక్ష్యం

మహిళలను లక్షాధికారులను చేయడమే
జగన్ సర్కార్ లక్ష్యం
ప్రభుత్వ  విప్ చిర్ల జగ్గిరెడ్డి
కోస్తా ఎన్ కౌంటర్, ఆత్రేయపురం రాష్ట మహిళలను లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమనీ, దానిలో భాగంగానే సంక్షేమ క్యాలెండర్‌ ను ప్రకటించి ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ద్వారా మంగళవారం నాడు మండలం పరిధిలోని ఉచ్చిలి ఆత్రేయపురం గ్రామాల్లో జరిగిన స్వయం సహాయక సంఘాల అక్కా చెల్లెళ్ళకు రెండో విడత ఋణమాఫీ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు అనంతరం జిల్లా పరిషత్ సిఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన పధకాల ద్వారా పొందిన లబ్ధి ఉపయోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలనీ, కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుండా అన్నపూర్ణ, జడ్పీటీసీ బోనం సాయిబాబా, ఎంపీడీఓ నాతి బుజ్జి, తాహశిల్దార్ ఎం రామకృష్ణ, ముదునూరి రామరాజు, పీఎస్ రాజు, కనుమూరి శ్రీనివాసరాజు, కప్పల శ్రీధర్, కోమలి సత్యనారాయణ, కొల్లి శ్యామ్, ఉర్రింకల త్రిమూర్తులు, గాదిరాజు రామకృష్ణంరాజు, పాలా నాగేశ్వరరావు, కరుటూరి బ్రహ్మాజీ, రంగరాజు, విష్ణు, చిలువూరి రామకృష్ణ రాజు, కొత్తపేట, రావులపాలెం ఎంపీడీఓలు కె.రత్నకుమారి, రాజేంద్ర ప్రసాద్ అధికారులు,వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comment here