Andhra PradeshEast GodavariNews

మహిళల ఆర్థిక సాధికారతకే జగనన్న అభ్యుదయ సంక్షేమ పథకాలు

మహిళల ఆర్థిక సాధికారతకే జగనన్న అభ్యుదయ సంక్షేమ పథకాలు
మాట తప్పని…మడమ తిప్పని ముఖ్యమంత్రి జగనన్న
_అక్కా చెల్లెమ్మలకు నాలుగు విడతలుగా రూ.25,157 కోట్ల రుణ మాఫీ
_రాష్ట్రవ్యాప్తంగా 78 వేల 76 లక్షల మందికి లబ్ధి
_రాబోయే కాలంలోనూ మీ చల్లని ఆశిస్సులు అందివ్వండి
_ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీలో అక్కా చెల్లెమ్మలకు ఎంపీ మార్గాని పిలుపు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 14:
మహిళ ఆర్ధిక సాధికారత కోసమే గౌరవ ముఖ్యమంత్రి జగనన్న అభ్యుదయ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని,
ఇచ్చిన మాటను తప్పకుండా…వేసిన అడుగును వెనక్కు తిప్పికుండా తన సుధీర్ఘ పాదయాత్రలో అక్కా చెల్లమ్మలకు ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం నిరంతరం పరితపిస్తూ…రాష్ట్రవ్యాప్తంగా నాలుగు విడతలుగా రూ.25,157 కోట్లను అక్కా చెల్లెమ్మల డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిదేనని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాల పరిధిలోని అక్కా చెల్లెమ్మలకు ఆసరా రెండో విడత పంపిణీ కార్యక్రమం గురువారం నగరంలోని కోటిపల్లి బస్టాండు సమీపంలోని ప్రభుత్వ భాలికోన్నత ఉన్నత పాఠశాలలో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌తోపాటు, ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్రాజు, స్మార్ట్ సిటీ చైర్మన్ చందన నాగేశ్వర్, రుడా చైర్ పర్సన్ షర్మిలారెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
మహిళలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు.
కార్యక్రమానికి ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ
నగర పరిధిలో డ్వాక్రా సంఘాల సంఖ్య, అందులో ఉన్న అక్కా చెల్లెమ్మల సంఖ్య, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేసిన నిధులు, రుణమాఫీకి సంబంధించి నివేదికను ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ 2019 ఏప్రియల్‌ నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాలకు చెందిన అక్కా చెల్లెమ్మలు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాన్ని దానిపై వడ్డీని నాలుగు దఫాలుగా వారి వారి పొదుపు ఖాతాలకు జమ చేయడం జరుగుందన్నారు.
ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో అక్కా చెల్లెమ్మల బాధలను కళ్లారా చూశారని, చెవులారా విన్నారని, నాడు ఇచ్చిన హామీని అమలు చేయడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి పాలన సాగిస్తున్నారని అన్నారు.
ఇందులో భాగమే మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7.97 లక్షల సంఘాలకు రూ.6,318.76 కోట్లును విడుదల చేశారని,
రెండో విడతగా రూ.6,439.52 కోట్లను విడుదల చేశారని గుర్తు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 14,330 సంఘాలకు మొదటి విడతగా రూ.102.88 కోట్లు, రెండో విడతగా రూ.106.71 కోట్లు విడుదల చేశారని చెప్పారు.
ఒక్క రాజమహేంద్రవరం నగర పరిధిలోని 3,931 పొదుపు సంఘాలకు మొదటి విడతగా రూ.24.35 కోట్లు, రెండో విడతలో 4,007 సంఘాలకు రూ.25.55 కోట్లు రుణాన్ని, వడ్డీని మాఫీ చేశారని అన్నారు.
అయితే ఎన్నికల ముందు నాటి అధికార పక్షం, నేటి ప్రతిపక్షం నాయకుడు చంద్రబాబు నాయుడు కళ్లబొళ్లి హామీలు ఇచ్చి అక్కా చెల్లెమ్మలను మోసం చేసేందుకు ప్రయత్నించారని అన్నారు.
అయితే ఇది గమనించే గత ఎన్నికల్లో ఆయనకు అక్కా చెల్లెమ్మలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 90 శాతం హామీలను కేవలం రెండేళ్ల పాలనలో పూర్తి చేసినా ప్రతిపక్ష పార్టీలు ఏదోలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని అన్నారు.
రాష్ట్రంలో జనరంజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి తమ సంపూర్ణ ఆశిస్సులను అందించాలని ఆయన కోరారు.
ముఖ్య అతిథిగా కొయ్యే మోషేన్‌ రాజు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్‌ రెడ్డి…మహిళలంతా ఆయనకు అండగా నిలవాలని కోరారు.
గత ముఖ్యముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోస గించడం వల్లే మహిళలంతా ఆయనకు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కో`ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌, రుడా ఛైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర తెలకుల, గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవాని ప్రియా,
గౌడ, శెట్టిబలిజ, యాత, శ్రీశైన కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పాలిక శ్రీను, రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు డైరెక్టర్
పిల్లి నిర్మల కుమారి తదితరులు మాట్లాడారు.
వైకాపా నాయకులు మాజీ కార్పొరేటర్లు
మింది నాగేంద్ర, మింది మాదవి ఆధ్వర్యం వహించారు.
ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్
కానుబోయిన సాగర్‌, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ మార్తి లక్ష్మి, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, నగరపాలక సంస్థ చైర్మన్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, బీసీ కడలి వెంకటేశ్వరరావు, వై ఎస్ ఆర్ సి పి నగర బీసీ సెల్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, పొడిపి చిన్న, నిరీక్షణా జేమ్స్‌, లక్కోజు ఓంకార్‌, నెల్లి సర్వేశ్వరరావు, బిల్డర్‌ చిన్న, అంగడ సత్యప్రియ, గేడి అన్నపూర్ణరాజు, చీరా రాజు, దుర్గారెడ్డి, వడ్డికూటి సత్యవేణి,  మార్గాని బుజ్జి, కొత్త విజయ రాజ్యలక్ష్మి, రాజమౌళి, నేతి నాగమణి, పీతా రామకృష్ణ, గౌడ శెట్టిబలిజ నాయకులు మార్గాని చంటిబాబు,  తదితరులు పాల్గొన్నారు.

Comment here