Andhra PradeshEast GodavariNews

*మహిళా సాధికారత, స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం* 

*మహిళా సాధికారత, స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం*
_ *ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి*
కోస్తా ఎన్ కౌంటర్, ఆత్రేయపురం
అక్కాచెల్లెళ్ల  సంక్షేమం,  స్వావలంబన,  సాధికారతే  ధ్యేయంగా ప్రతీ మహిళను లక్షాధికారిని చేసే దిశగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న  వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారని కొత్తపేట నియోజకవర్గం శాసనసభ్యులు, ఏపీ పీయూసీ చైర్మన్ మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆత్రేయపురం మండలంలోని అన్ని గ్రామాల పొదుపు సంఘాల లోని అక్కా చెల్లెమ్మలకు బాసటగా  ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా పధకం ద్వారా పొదుపు సంఘాల ఋణమాఫీ రెండో విడత సొమ్ము విడుదల చేస్తూ ఎంపీపీ కుండా అన్నపూర్ణ అధ్యక్షతన పేరవరం గ్రామంలో ఎస్వీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొని, మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ చేసారు..ఈ సమావేశంలో   మరో ముఖ్య అతిథి గా పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ హౌసింగ్ మరియు ఆసరా A. భార్గవ తేజ  మాట్లాడుతూ జిల్లాలో వైఎస్ఆర్ ఆసరా లబ్ధికి  కొత్తపేట నియోజకవర్గంలో 1355 సంఘాలు అర్హత సాధించడం వల్ల, అత్యధికంగా 55 కోట్ల రూపాయలు వారి ఖాతాలకు జమ అవుతుందనీ, ఇదే క్రమశిక్షణ భవిష్యత్తులో కూడా కొనసాగిందాలని తెలిపారు.. ఈ సందర్భంగా మహిళలంతా కలసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, వారి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ బోనం సాయిబాబా, ఎంపీడీఓ నాతి బుజ్జి, తాహశిల్దార్ ఎం రామకృష్ణ, ఏరియా కోఆర్డినేటర్ అన్నపూర్ణ, వైస్ ఎంపీపీ పెన్మెత్స బంగార్రాజు,కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్ డేవిడ్ రాజు, ఎంపీపీ మార్గాని గంగాధర్, ఆత్రేయపురం మండలంలో వివిధ పదవులలో ఉన్న నాయకులు ముదునూరి రామరాజు, పీఎస్ రాజు, కనుమూరి శ్రీనివాసరాజు, కప్పల శ్రీధర్, కోమలి సత్యనారాయణ,కొల్లి శ్యామ్ తదితరులు, అన్ని గ్రామాల సర్పంచులు గాదిరాజు రామకృష్ణ రాజు, ముదునూరి గణపతి రాజు, కరుటూరి బ్రహ్మాజీ, వేముల శ్రీనివాస్, గంటి విజయ భారతి,ఉర్రింకల త్రిమూర్తులు, నరాలశెట్టి సుబ్బలక్ష్మి తదితరులు,  ఎంపీటీసి సభ్యులు కుంచే సత్యవతి, కొవ్విలి లక్ష్మీ, నిచ్చెనకోళ్ల రాణి,పాలా వెంకటరమణ,ఏపుగంటి వీరరాఘవులు,పి. జయపాల్ తదితరులు నాయకులు  అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు

Comment here