Andhra PradeshEast GodavariNews

మాట తప్పడు మడమ తిప్పడు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

మాట తప్పడు మడమ తిప్పడు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పరవాడ లో ఆసరా సమావేశంలో మాట్లాడుతున్న పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదిప్ రాజ్

కోస్తా ఎన్కౌంటర్/విశాఖపట్నం:
పరవాడ మండల కేంద్రమైన మేజర్ పంచాయతీ పరవాడ గ్రామంలో సంతబయలు వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొదుపు సంఘాల అక్క చెల్లమ్మలకు బాసట గా వై.ఎస్.ఆర్ ఆసరా 2 వ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ పాల్గొన్నారు. పరవాడ మండలం ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు , పరవాడ జడ్పీటిసి పి ఎస్ రాజు విచ్చేశారు.ముందుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ రాజశేఖరరెడ్డి గారి చిత్రపటానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు పాలుఅభిషేఖం చేసి, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్ర సి ఈ సి సభ్యులు,పరవాడ ఎంపీటీసీ 2 పైల శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 7,97,000 పొదుపు సంఘాల్లో ఉన్న 78,76,000 మంది అక్కచెల్లెమ్మలు 2019 ఏప్రిల్‌ నాటికి రూ.25,517 కోట్లు బ్యాంకులకు బాకీ పడ్డారని తెలిపారు. ఈ మొత్తాన్ని 4 విడతల్లో ఉచితంగా వారి చేతికే అందిస్తామని ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి తొలి ఏడాది రూ. 6,318 కోట్లను అందజేయడం జరిగిందని, రెండో ఏడాది రూ. 6,440 కోట్లను డ్వాక్రా మహిళలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. పరవాడ మండల లో 1006 డ్వాక్రా సంఘాల మహిళలు కు రూ.11.46 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులను జమ చెయ్యడం జరిగింది అని తెలిపారు. ఈ వైయస్సార్ ఆసరా ద్వారా అర్హత పొందిన డ్వాక్రా సభ్యులు సంఖ్య 11,066 మంది. వారందరికీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి వై.ఎస్.ఆర్ ఆసరా పథకం ద్వారా రెండో విడత గా 11.46 కోట్లు రూపాయలను రుణమాఫీ చెయ్యడం జరిగింది అని తెలిపారు.రాష్ట్రంలోని మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంబ‌న‌, సంక్షేమ‌మే ధ్యేయంగా ప్ర‌భుత్వం పని చేస్తోంద‌ని, వేల కోట్లు వెచ్చిస్తూ ఆ దిశ‌గా ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంద‌ని తెలిపారు. ప్ర‌తి అక్క‌చెల్ల‌మ్మా సంతోషంగా ఉండాల‌న్న‌దే రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్ష అని పేర్కొన్నారు. న‌వ‌ర‌త్నాల పేరుతో అన్ని వ‌ర్గాల వారినీ ఆదుకునేలా అమ‌లు చేస్తున్న ప‌థకాలు దేశ చ‌రిత్ర‌లోనే క‌లికితురాయి వంటివ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం ఎన్నో క‌ష్టన‌ష్టాల‌కు ఓర్చి మంచి ప‌నులు చేస్తున్న‌ప్ప‌టికీ కొంత‌మంది అర్థం లేని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. అనంతరం పరవాడ మండలం ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వారి అభివృద్దికై ఆర్ధిక చేయూతనందిస్తూ మహిళలను అన్ని రంగాలలో అగ్రస్థానం లో నిలబెడుతున్నదని అని అన్నారు. పరవాడ జడ్పీటీసీ పైల సన్యాసిరాజు మాట్లాడుతూ జగనన్న తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా పాటిస్తూ మహిళలకు ఆర్ధిక చేయూత నందించి వారు స్వయం శక్తితో నిలబడే విధంగా కృషి చేస్తున్నారన్నారు. గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికి తాను ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత వై.ఎస్.ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేసారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యదిక టెస్టులు, వ్యాక్సినేషన్ వేసిన ఘనత మన రాష్ట్రానిదే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కులమతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను పారదర్శకంగా నూటికి నూరు శాతం అందజేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 23 రకాల పథకాలు ప్రస్తుతం అమలు జరుగుతున్నాయన్నారు. ఈ పథకాలు ద్వారా ప్రతి కుటుంబం సంవత్సరానికి 50 వేల నుండి లక్ష రూపాయల వరకు లబ్ది పొందుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా సంక్షేమ కేలండరును అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జి అన్నంరెడ్డి అజయ్ రాజ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు , పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు , పరవాడ మండలం వైస్ ఎం.పీ.పీ బంధం నాగేశ్వరరావు , పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు , గొర్లివాన్నిపాలెం సర్పంచ్ గొర్లి గోపి అమ్మలు , వెన్నలపాలెం సర్పంచ్ వెన్నెల అప్పారావు , ముత్యాలమ్మపాలెం సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు, పీ.బోనంగి సర్పంచ్ బండారు కల్పన రాజ్ శేఖర్, భారణికం సర్పంచ్ పెదిశెట్టి పూజ శేఖర్ , పిఎసిఎస్ చైర్మన్ బురద రాజు , మాజీ సిసిఎస్ చైర్మన్ చల్ల కనకరావు, కలపక సర్పంచ్ బోండా కనకరావు, నాయుడు పాలెం సర్పంచ్ కుండ్రాపు వరలక్ష్మి సీతారామయ్య , తిక్కవాన్నిపాలెం సర్పంచ్ చేపల మసేను, పరవాడ మండలం లో గల ఎం.పీ.టి. సి లు , వెలుగు ఏపిఎం సాయి రమేష్ , పరవాడ హేమ సుందర రావు , ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా మహిళలు, వై.ఎస్.ఆర్.సి.పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Comment here