Andhra PradeshEast GodavariNews

ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న తాసిల్దార్ కె నవీన్ కుమార్.

ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న తాసిల్దార్ కె నవీన్ కుమార్.

కోస్తా ఎన్ కౌంటర్ టి నరసాపురం. పశ్చిమగోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం లో ముంపుకు గురైన ప్రాంతాలను సోమవారం తాసిల్దార్ కె నవీన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్య వస్తే వెంటనే స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు. పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానిక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లకు సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు రావాలని అనవసరంగా బయటకు రాకూడదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Comment here